ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు: రవీంద్ర జడేజా సెంచరీ... 8వ వికెట్ కోల్పోయిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Jul 2, 2022, 3:40 PM IST
Highlights

టెస్టుల్లో మూడో సెంచరీ నమోదు చేసిన రవీంద్ర జడేజా... 8వ వికెట్ కోల్పోయిన టీమిండియా... 

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 338/7 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి మెరుపు ఆరంభం అందించాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. 183 బంతుల్లో 13 ఫోర్లతో 100 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, టెస్టు కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు...

మ్యాటీ పాట్స్ బౌలింగ్‌లో నలుగురు బౌండరీలు బాదిన రవీంద్ర జడేజా, 79వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్‌తో సెంచరీ మార్కును అందుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు సెంచరీ చేయడం ఇది మూడోసారి. ఇంతకుముందు 1999లో ఎస్ రమేశ్, సౌరవ్ గంగూలీ కలిసి న్యూజిలాండ్‌పై సెంచరీలు బాదారు. 2007లో సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ ఇద్దరూ పాకిస్తాన్‌పై శతకాలు నమోదు చేశారు. 15 ఏళ్ల తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఇద్దరూ ఇంగ్లాండ్‌పై ఈ ఫీట్ నమోదు చేశారు...

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి రెండు సెంచరీలు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవీంద్ర జడేజా. ఇంతకుముందు 1986లో కపిల్ దేవ్, 2009లో ఎమ్మెస్ ధోనీ, 2010లో హర్భజన్ సింగ్ ఈ ఫీట్ సాధించారు. రవీంద్ర జడేజాతో కలిసి 8వ వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మహ్మద్ షమీ అవుట్ అయ్యాడు. 

31 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన మహ్మద్ షమీ, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో జాక్ లీచ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  మహ్మద్ షమీ వికెట్‌తో టెస్టుల్లో 550 వికెట్లను పూర్తి చేసుకున్నాడు స్టువర్ట్ బ్రాడ్. 

click me!