ఆయనతో పోలుస్తారు.. గంగూలీలా ధోనీ చేయలేదు: గంభీర్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 14, 2020, 6:56 PM IST
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీపై మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీపై మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని పేరు తెలియని వారు క్రికెట్ ప్రపంచంలో ఎవరూ ఉండరని అంటూననే.. ధోని సారథ్యంలో భారత్ క్రికెట్ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని చెప్పారు.

అంతర్జాతీయ టీ 20 వరల్డ్ కప్‌ను, 50 ఓవర్ల ప్రపంచ కప్‌ను గెలుపొందిందని గంభీర్ గుర్తుచేశారు. అలాగే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో కూడా భారత్ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు.

దీని కారణంగా ధోనిని చాలా సందర్భాల్లో డైనమిక్ క్రికెటర్ అంటూ గంగూలీలో పోలస్తూ ఉంటారని గంభీర్ తెలిపారు. అయితే దాదా తన కెప్టెన్సీలో ఎంతోమంది యువ క్రికెటర్లకు అవకాశం కల్పించారని గౌతం అన్నాడు.

యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ లాంటి ఎంతోమందికి చోటు కల్పించారని గంభీర్ చెప్పారు. సౌరవ్ సారథ్యంలో ఎంతోమంది నాణ్యమైన క్రికెటర్లు ప్రపంచానికి పరిచయం అయ్యారని, అది ధోని విషయంలో జరగలేదన్నాడు.

మహేంద్రుడు తన వారసుడిగా వచ్చిన విరాట్ కోహ్లీకి ఎక్కువ మంది క్వాలిటీ ప్లేయర్లను అందించలేదని గంభీర్ ఆరోపించాడు. ధోనీ నాయకత్వంలో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి వారు మాత్రమే క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారని తెలిపాడు. అదే దాదా మాత్రం యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ లాంటి అత్యుత్తమ క్రికెటర్లను అందించాడని గౌతం ప్రశంసించారు. 


 

click me!