ధోనీ, డుప్లిసిస్ కలిసి కుమ్మేశారు... బర్త్ డే పార్టీలో కుర్రాడిని పట్టుకుని...

Published : Nov 05, 2020, 04:57 PM IST
ధోనీ, డుప్లిసిస్ కలిసి కుమ్మేశారు... బర్త్ డే పార్టీలో కుర్రాడిని పట్టుకుని...

సారాంశం

IPL 2020 సీజన్‌లో ప్లేఆఫ్ స్టేజీకి అర్హత సాధించలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్... నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మోను కుమార్‌ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను రెండు వారాల క్రితమే చేసిన సీఎస్‌కే... పాత వీడియోను పోస్టు చేసిన చెన్నై కుమార్ సింగ్... మూడు సీజన్లలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన మోను...

IPL 2020 సీజన్‌లో ప్లేఆఫ్ స్టేజీకి అర్హత సాధించలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే, తొలిసారిగా పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. అయితే  చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ డుప్లిసిస్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించి, అత్యధిక పరుగులు చేసిన సీఎస్‌కే ప్లేయర్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం 14 మ్యాచుల్లో కలిపి 200 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

అయితే ఈ ఇద్దరూ కలిసి నేడు బర్త్ డే జరుపుకుంటున్న మోను కుమార్‌పై కేక్‌తో దాడి చేసి, కుమ్మేశారు. నేడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మోను కుమార్ బర్త్ డే. ప్లేఆఫ్‌కి అర్హత సాధించలేకపోయిన సీఎస్‌కే, ఎప్పుడో స్వదేశం బయలుదేరింది. మరి మోను బర్త్ డే ఎలా చేశారనుకుంటున్నారా? ఏం లేదు... ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సీఎస్‌కే, అక్టోబర్ 23న సీఎస్‌కే బౌలర్ కర్ణ్ శర్మ బర్త్ డే చేసింది.

అదే రోజు నవంబర్ 5న పుట్టినరోజు జరుపుకోవాల్సిన మోనుపై దాడి చేసి, కేక్ పూసి అడ్వాన్స్ బర్త్ డే విష్ చేశారు ధోనీ, డుప్లిసిస్, దీపక్ చాహార్. 2018 వేలంలో మోను కుమార్‌ను కొనుగోలు చేసిన సీఎస్‌కే, ఇప్పటిదాకా అతన్ని ఆడించింది ఒకే ఒక్క మ్యాచ్‌లో. అది కూడా ఈ సీజన్‌లోనే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన మోను, రెండు ఓవర్లు వేసి 20 పరుగులిచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో మోనుకి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఈ వీడియోను పోస్టు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

 

 

 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన