రిషబ్ పంత్ ప్రపంచ కప్ ఆడటం ఖాయం: రికీ పాంటింగ్

By Arun Kumar PFirst Published Apr 23, 2019, 5:11 PM IST
Highlights

ఐపిఎల్ లో అద్భుత బ్యాటింగ్ తో అదరగొడుతున్న డిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ రిషబ్ పంత్ పై జట్టు కోచ్, మాజీ ఆసిస్ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ఎంత కీలక ఆటగాడో మరోసారి రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా నిరూపితమైందని అన్నారు. ఇలాంటి ఆటగాన్ని ప్రపంచ కప్ జట్టులో ఎంపిక చేయకుండా టీమిండియా ఘోరమైన తప్పు చేసిందని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. 

సోమవారం జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్డేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య రాజస్థాన్ పై డిల్లీ ఘన విజయం సాధించింది. రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగి  191 పరుగుల భారీ స్కోరు సాధించగా...డిల్లీ మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరుకుంది. ఇలా 192 పరుగల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో డిల్లీ ఓపెనర్లు ధావన్, పృథ్విషా తో పాటు మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్ చక్కగా రాణించారు. పంత్ చెలరేగి పోయి బ్యాటింగ్ చేస్తూ కేవలం 36 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. దీంతో డిల్లీ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో సునాయాస విజయాన్ని అందుకుంది. ఇలా డిల్లీ క్యాపిటల్స్ ను పాయింట్స్ పట్టికలో టాప్ కు చేరుకునేలా చేశాడు పంత్. 

ఈ క్రమంలో అతడి వీరోచిత ఇన్నింగ్స్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలా ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ కూడా పంత్ ను ఆకాశానికెత్తేశాడు. ముఖ్యంగా అతడికి ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై పాంటింగ్ మాట్లాడుతూ... భారత్ మంచి అవకాశాన్ని చేజేతులా వదులుకుందన్నారు. వరల్డ్ కప్ జరిగే ఇంగ్లాండ్ పిచ్ లకు పంత్ బాగా సరిపోతాడని...మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లలో అతడు కీలకంగా వ్యవహరించేవాడన్నారు. స్పిన్నర్లపై సహజంగానే విరుచుకుపడే  పంత్ ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో వారిని ఒక ఆట ఆడుకునేవాడని పేర్కొన్నారు. 

ప్రస్తుతానికి అతడు ప్రపంచ కప్ ఆడకున్నా...భవిష్యత్ లో తప్పకుండా మూడు నాలుగు వరల్డ్ కప్ టోర్నీల్లో పాల్గొంటాడన్న నమ్మకం తనకుందన్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో అతడికి ఇంకా మంచి భవిష్యత్ వుందని ప్రశంసించారు. పంత్ పై తనకు చాలా నమ్మకముందని..దానికి తగ్గట్లుగానే అతడి ఆటతీరు సాగుతుందని భావిస్తున్నానని పాంటింగ్ వెల్లడించారు.  

click me!