సన్ రైజర్స్ ఓటములకు కారణమదే: కెప్టెన్ వార్నర్ అసంతృప్తి

By Arun Kumar PFirst Published Oct 19, 2020, 2:39 PM IST
Highlights

కొల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపై సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తీవ్ర అసంతృఫ్తి వ్యక్తం చేశాడు. 

స్పోర్ట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13లో భాగంగా ఆదివారం జరిగిన హెరాహోరీ పోరులో కోల్ కతా చేతిలో హైదరాబాద్ జట్టు ఓటమిని చవిచూసింది. చివరివరకు ఇరు జట్ల మధ్య గెలుపు ఊగిసలాడగా చివరకు సూపర్ ఓవర్ ద్వారా కెకెఆర్ విజేతగా నిలిచింది. ఇలా చివరిక్షణంలో ఓటమిపాలవడంపై కెప్టెన్ డేవిడ్ వార్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ... మాటలను ఎలా ప్రారంభించాలో కూడా అర్థం కావడంలేదన్నారు. గెలుపు ముగింటివరకు వచ్చి ఓటమి అంచుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. కీలక సమయంలో తమ జట్టు ఆట గాడితప్పడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. ఆరంభం బాగుంటున్నా ముగింపు మాత్రం చాలా చెత్తగా వుంటోందన్నారు. 

''ఈ మ్యచ్(కెకెఆర్ తో) లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం సరయిన నిర్ణయమే. అబుదాబి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా వుంటుంది కాబట్టే లక్ష్యచేధనే సులువని భావించారు.  కానీ ఇన్నింగ్ మధ్యలో తమ బ్యాటింగ్ లైనప్ గాడి తప్పడంతో ఓటమి తప్పలేదు'' అన్నాడు వార్నర్.

ఆదివారం టాస్ గెలిచి ప్రత్యర్థికి ఫీల్డింగ్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి మంచి షాక్ ఇచ్చారు సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆరంభంలో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్‌గా వచ్చిన కేన్ విలియంసన్, బెయిర్ స్టో కలిసి మొదటి వికెట్‌కి 57 పరుగులు జోడించారు.

అయితే సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న లూకీ ఫర్గూసన్ మ్యాజిక్‌ స్పెల్‌తో సన్‌రైజర్స్‌ను కష్టాల్లోకి నెట్టాడు. మొదటి బంతికి 19 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 29 పరుగులు చేసిన కేన్ విలియంసన్‌ను ఫర్గూసన్ అవుట్ చేశాడు. 28 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేసి జానీ బెయిర్ స్టో అవుట్ కాగా, ప్రియమ్ గార్గ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు.

మనీశ్ పాండే 6 పరుగులు, విజయ్ శంకర్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ 19వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు కావాల్సిన దశలో డేవిడ్ వార్నర్ 3 బౌండరీలతో 17 పరుగులు రాబట్టాడు. ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో సింగిల్ మాత్రమే రావడంతో మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్‌కి దారి తీసింది. 

సూపర్ ఓవర్‌లో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్‌కి 3 పరుగుల టార్గెట్ ఇచ్చింది. నాలుగు బంతుల్లో 3 పరుగులు చేసి ఈజీ విక్టరీ సాధించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 
 
 

click me!