Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా.. ఆస్పత్రిలో చేరిన దాదా

Published : Dec 28, 2021, 10:42 AM IST
Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా.. ఆస్పత్రిలో చేరిన దాదా

సారాంశం

BCCI president Sourav Ganguly COVID positive: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డాడు.  కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. 

టీమిండియా మాజీ సారథి, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డాడు. సోమవారం ఆయన కరోనా లక్షణాలు కనిపించడంతో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్నారు. అందులో పాజిటివ్ గా  తేలింది. దీంతో వెంటనే Ganguly.. కోల్కతా లోని వుడ్ల్యాండ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 

Corona లక్షణాలు కనిపిండచంతో సోమవారం ఆయన ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నాడు. సోమవారం అర్థరాత్రి ఆ రిపోర్టులు వచ్చాయి. దాంట్లో గంగూలీకి కరోనా  పాజిటివ్ గా  నిర్ధారణ అయింది. దీంతో అతడు వెంటనే ఆస్పత్రిలో చేరాడు. కాగా.. గంగూలీ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు  తీసుకోవడం గమనార్హం. 

 

ఇదిలాఉండగా.. గతంలో గంగూలీ కుటుంబసభ్యులు  కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన  సోదరుడు స్నీహశిష్ గంగూలీకి కూడా కరోనా సోకింది.  ఈ ఏడాది ఆరంభంలో కూడా గంగూలీ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ఆపరేషన్  కూడా నిర్వహించారు.  

కాగా.. గంగూలీకి కరోనా స్వల్ప లక్షణాలే కావడంతో ఆయన ఆరోగ్యం గురించి  పెద్దగా ఆందోళన చెందాల్సిన పన్లేదని  ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?