ఎలా గెలవాలో మాకు తెలుసు! అతనొక్కడు ఆడితే చాలు, 450 కొట్టేస్తాం... - బాబర్ ఆజమ్

ఫకార్ జమాన్ 30 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే చాలు, మేం చేయాలనుకున్న టార్గెట్ చేస్తాం...  నాపైన కెప్టెన్సీ ప్రెషర్ లేదు.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కామెంట్స్.. 

Google News Follow Us

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ కథ దాదాపు ముగిసింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో గెలిచినా, 99.99 శాతం పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరే అవకాశం లేదు. ఒకవేళ పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది...

లేదా ఇంగ్లాండ్ 150 పరుగులు చేసినా 3.4 ఓవర్లలో దాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అది వీలయ్యే పని కాదు. బాబర్ ఆజమ్ పేలవ కెప్టెన్సీపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. బ్యాటర్‌గా కూడా బాబర్ ఆజమ్ అనుకున్నంతగా రాణించలేదు..

‘గత మూడేళ్లుగా నేను పాకిస్తాన్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్నా, నాకెప్పుడూ కెప్టెన్సీ ప్రెషర్‌గా అనిపించలేదు. నేనొక్కడినీ బాగా ఆడకపోవడం వల్ల ఈ పొజిషన్‌లో ఉన్నామని కూడా నాకు అనిపించడం లేదు..

నాకు ఎలాంటి ప్రెషర్ లేదు. ఫీల్డింగ్‌లో బెస్ట్ ఫీల్డింగ్ ఇస్తా. బ్యాటింగ్‌లో టీమ్ విజయానికి ఏం కావాలో అలాగే ఆడతా. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతున్నారు. మేం ఎంత చేయాలో మాకు ఓ ఐడియా ఉంది.

నెట్ రన్ రేట్ గురించి మా ప్లాన్స్ మాకున్నాయి. ఫకార్ జమాన్ 30 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే చాలు, మేం చేయాలనుకున్న టార్గెట్ చేస్తాం. 450 కొట్టడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. అతను త్వరగా అవుట్ అయినా మిడిల్ ఆర్డర్‌లో మంచి హిట్టర్లు ఉన్నారు..’ అంటూ కామెంట్ చేశాడు బాబర్ ఆజమ్..