ఇండియాపై గెలవడంతో పాక్‌ను ప్రశంసిస్తూ వాట్సాప్ స్టేటస్ .. ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌ను సస్పెండ్..

By team teluguFirst Published Oct 27, 2021, 1:30 PM IST
Highlights

టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై  పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత పాక్ ఆటగాళ్లను (Pakistan players) ప్రశంసిస్తూ వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేసిన ముగ్గురు విద్యార్థులను ఓ ఇంజనీరింగ్ కాలేజ్ సస్పెండ్ చేసింది. 

టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై  పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత పాక్ ఆటగాళ్లను (Pakistan players) ప్రశంసిస్తూ వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేసిన ముగ్గురు విద్యార్థులను ఓ ఇంజనీరింగ్ కాలేజ్ సస్పెండ్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు.. అర్షీద్ యూసఫ్, ఇనాయత్ అల్తాఫ్ షేక్, షౌకత్ అహ్మద్ గనై ఆగ్రాలోని రాజ బల్వంత్ సింగ్ ఇంజనీరింగ్ టెక్నికల్ క్యాంపస్‌కు చెందినవారు. వీరు ముగ్గురి స్వస్థలం జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir). వీరు పాకిస్తాన్‌కు అనుకూలంగా పోస్ట్‌లు చేసినందరకు హాస్టల్ నుంచి వారిని సస్పెండ్ చేశారు. 

‘పాకిస్తాన్‌కు అనుకూలంగా స్టేటస్ పెట్టడాన్ని క్రమశిక్షణ రహిత్య చర్యగా భావిస్తున్నాం. అందకే క్రమశిక్షణ కమిటీ వారి ముగ్గురిని తక్షణమై సస్పెండ్ చేయాలని నిర్ణయించింది’ అని హాస్టల్ డీన్ డాక్టర్ దుష్యంత్ సింగ్ సస్పెన్షన్ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్‌కు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ యువజన విభాగం (BJP youth wing) స్థానిక నాయకులు జగదీష్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు ఫిర్యాదు అందిందని.. ఫిర్యాదు ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆగ్రా  నగర ఎస్పీ వికాస్‌ కుమార్ తెలిపారు. 

Also read: సమీర్‌ వాంఖడే నికాహ్ నామా, మొదటి పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన నవాబ్ మాలిక్.. దాడిని మరింతగా పెంచేశారు..

ఈ నేపథ్యంలోనే కాలేజ్ యజమాన్యం వీరి ముగ్గురుని సస్పెండ్ చేసింది. ‘విద్యార్థులు ప్రధాన మంత్రి సూపర్ స్పెషల్ స్కీమ్ కింద చదువుతున్నారు. విద్యార్థుల చర్యను మేము ప్రధాన మంత్రి కార్యాలయం, ఏఐసీటీఈకి తెలియజేశాం. అయితే విద్యార్థులు క్షమాపణలు చెప్పారు’అని కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ పంకజ్ గుప్తా తెలిపారు. 

Also read: కొవాగ్జిన్‌‌పై అదనపు వివరణలు కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇంకా పెండింగ్‌లోనే..

మరోవైపు టీమిండియా పాకిస్తాన్‌ గెలుపును ఎంజాయ్ చేస్తూ సంబరాలు చేసుకున్న శ్రీనగర్‌లోని వైద్య విద్యార్థులపై  కేసులు నమోదు చేశారు. కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద వీరిపై అభియోగాలు మోపారు. మెడికల్ కాలేజీ శ్రీనగర్, షేర్ కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని బాలికల హాస్టళ్ల వద్ద మహిళా విద్యార్థినులు పాకిస్థాన్ విజయంతో ఆ దేశానికి అనుకూల నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయ

click me!