ఆసియాకప్ 2023.. రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ..!

Published : Sep 05, 2023, 01:35 PM IST
 ఆసియాకప్ 2023.. రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ..!

సారాంశం

టీమిండియా సారథి రోహిత్‌శర్మ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాకప్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

ఆసియాకప్ 2023టోర్నీలో టీమిండియా అదరగొడుతోంది. పాక్ తో మ్యాచ్ రద్దు అయినా, నేపాల్ తో మ్యాచ్ మాత్రం సునాయాసంగా గెలిచింది. తొలుత ఈ మ్యాచ్ లో తడపడినా, చివరకు నిలపడి విజయం సాధించింది. కాగా,  ఈమ్యాచ్ లో రోహిత్ శర్మ అదరగొట్టారు.  ఈ మ్యాచ్‌లో 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేసిన టీమిండియా సారథి రోహిత్‌శర్మ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాకప్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

ఆసియాకప్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 9 అర్ధ సెంచరీలతో ఓ రికార్డు ఉంది. అయితే, ఆ రికార్డును ఇప్పుడు రోహిత్ శర్మ బ్రేక్ చేసేశాడు.  సచిన్ ఇప్పటి వరకు టాప్ ప్లేస్‌లో ఉండగా రోహిత్ 10 హాఫ్ సెంచరీలతో అతడిని అధిగమించాడు. అలాగే, ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో 23 సిక్సర్లతో మరో రికార్డును తనపేరున రాసుకున్నాడు. 18 సిక్సర్లతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సురేశ్ రైనా రికార్డును బద్దలుగొట్టాడు. ఓవరాల్‌గా 26 సిక్సర్లతో షాహిద్ అఫ్రిది, 23 సిక్సర్లతో సనత్ జయసూర్య ముందున్నారు.

ఈ మ్యాచ్ ఆడిన తర్వాత అద్భుత ఇన్నింగ్స్ ఆడిన  రోహిత్ పలు రికార్డులు క్రియేట్ చేశాడు. ఆసియా కప్ టోర్నీలో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన భారతీయ ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఈ టోర్నీలో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేశాడు. రోహిత్ ఇప్పటి వరకు  ఆసియా కప్ లో 10సార్లు యాభైకి పైగా స్కోర్లు సంపాధించాడు. సచిన్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. సచిన్ టెండుల్కర్ 9 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం.

PREV
click me!

Recommended Stories

Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !