ఢిల్లీలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. దేశరాజధానిలో ఆదివారం 300 మందికి పైగా పోలీసులకు కరోనా సోకింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. పార్లమెంట్ లో పని చేసే సిబ్బందిలో 400 మందికి శనివారం కరోనా సోకింది
కరోనా (corona) కలకలం సృష్టిస్తోంది. దేశంలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారీగా కేసులు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక రోజు వ్యవధిలోనే లక్షన్నర కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 10 రోజుల క్రితం వరకు పదివేల లోపు కేసులు మాత్రమే నమోదవగా.. ఇప్పుడు ఆ కేసులు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే దేశంలోకి కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant) కేసులు కూడా పెరుగుతున్నాయి. గత నెల డిసెంబర్ 2వ తేదీన ఈ వేరియంట్ కేసులు దేశంలో మొదటి సారిగా కర్నాటక (karnataka) రాష్ట్రంలో గుర్తించారు. ఇప్పుడు వీటి సంఖ్య మూడు వేలు దాటింది.
కోవిడ్ (covid) కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. వీకెండ్ కర్ఫ్యూ (weekend curfew), నైట్ కర్ఫ్యూ (night curfew) లు విధిస్తున్నాయి. అయితే ఈ ఆంక్షలన్నీ అమలు జరిగేలా కృషి చేసే పోలీసులకే కోవిడ్ -19 (covid- 19) సోకడం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో (delhi) కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల్లో ఢిల్లీ ముందు వరుసలో ఉంది. అయితే ఆ నగరంలోని పోలీసులు ఉన్నతాధికారులైన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO), అదనపు కమిషనర్ చిన్మోయ్ బిస్వాల్‌తో సహా 300 మందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బంది కోవిడ్ పాజిటివ్ గా తేలారు.
undefined
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌తో (police headquarters) పాటు అన్ని యూనిట్లు, వివిధ పోలీసు స్టేషన్లలోని సిబ్బందికి కరోనా సోకింది. గత కొంత కాలంగా ఢిల్లీలో కోవిడ్ నిబంధనలు అమలు చేయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు వారికి కూడా కరోనా సోకడం వల్ల పోలీసు వ్యవస్థపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో 22,751 కొత్త కోవిడ్ -19 COVID-19 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం బులిటెన్ విడుదల చేసింది. గతేడాది మే 1వ తేదీ నుంచి ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గతేడాది మే1న ఢిల్లీలో 25,219 COVID-19 కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ (health buliten) ప్రకారం.. కోవిడ్ పాజిటివ్ రేటు (covid possitive rate) 23.53 శాతంగా ఉంది. దీంతో మొత్తం 15,49,730 కేసులు అయ్యాయి. 60,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 14,63,837 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల 17 మంది మృతి చెందారు. ఇదిలావుండగా 400 మంది పార్లమెంట్ (parlament) సిబ్బందికి శనివారం కరోనా సోకింది. మరికొన్నిరోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ప్రభావం పడే అవకాశం కన్పిస్తున్నది. అయితే ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రస్తుతం తమకు లాక్ డౌన్ విధించే ఆలోచన ఏమీ లేదని అన్నారు. అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే మాత్రం లాక్ డౌన్ విధిస్తామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.