వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఒక మేమీ పోస్ట్ చేస్తూ షేర్ చేశారు. కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సామాజిక దూరాన్ని తప్పనిసరి చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుండి ఇంటి నుండి పనిచేయడం గురించి గొప్ప విషయాలన్నీ సోషల్ మీడియాలో నిండిపోయాయి.
ఇంటి నుండి పని చేయటం కొత్తగా సాధారణం కావడంతో, ప్రజల పని అలవాట్లలో తీవ్రమైన మార్పు కనిపించింది. కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సామాజిక దూరాన్ని తప్పనిసరి చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుండి ఇంటి నుండి పనిచేయడం గురించి గొప్ప విషయాలన్నీ సోషల్ మీడియాలో నిండిపోయాయి.
వర్క్ ప్రారంభించటానికి ఐదు నిమిషాల ముందు మంచంపై నుండి లేచి వర్క్ స్టార్ట్ చేస్తుంటారు- డబల్యూఎఫ్‌హెచ్ ఆనంద్ మహీంద్రాతో సహా చాలా మంది దీనిని ఎలా ఆనందిస్తున్నరో చెప్పుకొచ్చారు.
ఆదివారం రోజున వ్యాపారవేత్త అయిన ఆనంద్ మహీంద్ర ఇంటి నుండి పని చేయడం గురించి ఒక మేమితో పాటు కన్ఫెషన్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. దీనిని తన వాట్సప్ వండర్ బాక్స్ నుండీ షేర్ చేస్తున్నట్టు తెలిపాడు.
64 ఏళ్ల ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ ఇంటి నుండి పనిచేసే విధానం రియాలిటీకి ఊహించినదానికి మధ్య వ్యత్యాసాన్ని ఉన్న చూపిస్తుంది. ఊహించిన విధంగా తేలికైన దుస్తులు ధరించి వర్క్ చేస్తున్నట్టుగా కనిపించిన 'రియాలిటీ' మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది.
ఎలా అంటే ఒక పక్క ఒక వ్యక్తి లుంగీ ధరించి, వంటగదిలో వంట చేస్తూ, మరోపక్క వర్క్ కాల్ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మేమితో పాటు ఆనంద్ మహీంద్రా ఒకప్పుడు ఇంటి నుండి పనిచేసేటప్పుడు చొక్కాల క్రింద లుంగీ ధరించినట్లు ఒప్పుకున్నాడు.
"ఇంటి నుండి కొన్ని వీడియో కాల్స్ మాట్లాడాల్సి వచ్చినపుడు నేను నా చొక్కా కింద లుంగీ ధరించాను" అని తన ట్వీట్ లో చెప్పుకున్నారు.
"మిటింగ్స్ సమయంలో ఏ సమయంలోనైనా నిలబడవలసిన అవసరం లేదు, కానీ ఈ ట్వీట్ తర్వాత నా సహచరులు నన్ను నువ్వు అలా చేశావా అని అడుగుతుండొచ్చు అని అనుకుంటున్నాను అని అన్నారు.
ఆన్‌లైన్‌లో ఈ విషయాన్నిపోస్ట్ చేసినప్పటి నుండి 19వేల 'లైక్‌లు' చేశారు. అలాగే కామెంట్ విభాగంలో, చాలామంది ఇంటి నుండి పని చేయటం గురించి మరిన్ని మీమిలు, ఫన్నీ వీడియోలను కామెంట్లలో పోస్ట్ చేశారు.