ఇండియాలోని కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ 108 దేశాలు గుర్తించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి లోక్ సభకు వివరించారు.
ఓమ్రికాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొవడానికి అసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. గత వేవ్స్ ఎదురైన క్లిష్ట పరిస్థితులు మళ్లీ ఎదురుకాకుండా, ఆ వేవ్స్ నుంచి గుణపాటాలను నేర్చుకుని అన్ని వసతులను సమకూర్చుకొంటున్నాయి. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ను ప్రక్రియలో వేగం పెంచాయి. ప్రయాణికులకు కూడా ఆంక్షలు విధించాయి. ఇతర దేశాల నుంచి తమ దేశాలకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటేనే తమ దేశానికి రావడానికి అనుమతి ఇస్తామని పలు దేశాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీయానం చేసే వారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అయ్యింది. అయితే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చెల్లుబాటు కావాలి అంటే అంతర్జాతీయ వైద్య ప్రమాణాలను పాటిస్తూ తయారు చేసిన వ్యాక్సిన్ అయి ఉండాలి. అలా తీసుకున్న వ్యాక్సిన్ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అయితే మనం దేశం రూపొందించిన, ఇతర దేశాలు రూపొందించి భారత ప్రభుత్వం అనుమతించిన వ్యాక్సిన్ ల వేయించుకున్న వారి సర్టిఫికెట్ ను అత్యధిక దేశాలు ఆమోదిస్తున్నాయి. ఇప్పటి వరకు 108 దేశాలు ఇండియన్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను గుర్తించాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ధారించింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ కుమార్ సమాధానం ఇచ్చారు. అంటే మన దేశంలో వ్యాక్సిన్ వేసుకున్న పౌరులు ఆ వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకొని ఆ 108 దేశాల్లో పర్యటించవచ్చన్నమాట.
స్కూళ్ల మూత.. 32 కోట్ల మంది చిన్నారులపై ప్రభావం
undefined
దేశంలోని పలు దేవాలయాల్లోనూ అమలు..
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను ఇతర దేశాలే కాదు మన దేశంలోని కొన్ని దేవాలయాలు తప్పనిసరి చేశాయి. రెండు డోసులు వేసుకున్న వారినే ఆలయంలోకి అనుమతిస్తామని పలు దేవాలయాల బోర్డులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. అలాంటి దేవస్థానాలలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేశ స్థానం కూడా ఉంది. రెండు డోసులు వేసుకొని, దానికి సంబంధించిన సర్టిఫికెట్ తీసుకొని వస్తేనే ఆలయంలో దర్శనం చేసుకోనిస్తామని ఇప్పటికే టీటీడీ బోర్డు తెలిపింది.
తెలంగాణలో 4 కోట్లు దాటిన వ్యాక్సిన్‌లు..
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. డిసెంబర్ చివరి నాటికి దాదాపు 100 శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ పని చేస్తోంది. అయితే శుక్రవారం నాటికి తెలంగాణ ప్రభుత్వం ఓ మైలురాయిని దాటింది. ఆ రోజుకు తెలంగాణలో 4 కోట్ల డోసులు ఇచ్చిన్నట్టు ప్రకటించింది. జనవరి 15తరువాత ఓమ్రికాన్ వేరియంట్ కేసులు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్ననేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఆలోపు అందరికీ వ్యాక్సిన్స్ ఇవ్వగలిగితే ఓమ్రికాన్ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చని భావిస్తోంది. ఒక వేళ ఓమ్రికాన్ సోకినా స్వల్ప లక్షణాలతో, హాస్పిటల్స్ చేరకుండా ఇంటి వద్దే నయం చేసుకోవచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. వ్యాక్సినేషన్ అయిన వారు స్వల్ప లక్షణాలతో భయటపడుతున్నారని నివేధికలు చెపుతున్నాయి.