అమెజాన్ ఉద్యోగుల ఆందోళన..కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ నిరసన

By Sandra Ashok Kumar  |  First Published Apr 23, 2020, 4:31 PM IST

ఒక పక్క కరోనా వైరస్  మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తు ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటే, మరో పక్క అమెజాన్ సంస్థ తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ వందల మంది అమెజాన్ ఉద్యోగులు పెద్దఎత్తున నిరసన చేపట్టేందుకు సిద్ధపడటం ఆందోళనకు దారి తిస్తోంది.
 


వాషింగ్టన్: ప్రముఖ ఆన్లైన్ రీటైలర్ దిగ్గజం అమెజాన్ సంస్థలోఉద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పై ఎదుర్కొనే చర్యల్లో భాగంగా తమకు వ్యక్తిగత సంరక్షణ పరికరాలను అందించకపోవడం వంటి పలు ఆరోపణలతో అమెరికాలోని అమెజాన్  గిడ్డంగుల ఉద్యోగులు సమ్మెకు సిద్ధపడ్డారు.

ఒక పక్క కరోనా వైరస్  మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తు ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటే, మరో పక్క అమెజాన్ సంస్థ తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ వందల మంది అమెజాన్ ఉద్యోగులు పెద్దఎత్తున నిరసన చేపట్టేందుకు సిద్ధపడటం ఆందోళనకు దారి తిస్తోంది.

Latest Videos

మంగళవారం నుండి సంస్థలో పని చేసే 300 మందికి పైగా అమెజాన్ ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా నిరసనకు దిగనున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన గిడ్డంగుల వద్ద పని చేసేవారికి రక్షణ పరికరాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని, గిడ్డంగులను శుభ్రపరచడం, భద్రతా సామగ్రి, జీతంతో కూడిన సెలవు, ప్రమాద వేతనం కూడా అందించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

వ్యతిరేకంగా మాట్లాడిన తమ సహచరులపై ప్రతీకారం తీర్చుకోవద్దని అమెజాన్‌ను కోరుతున్నారు. అమెజాన్ సంస్థకు ఆదాయం మీద ధ్యాసే తప్ప సంస్థ  సిబ్బంది భద్రతపై శ్రద్ధ లేదని మిచిగాన్ లోని అమెజాన్ కార్మికుడు జేలెన్ క్యాంప్ ఆరోపించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గిడ్డంగులను మూసివేసి శానిటైజేషన్ కార్యక్రమాలను పూర్తిగా చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కరోనా వైరస్ మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. వేళల్లో మృతి చెందగా లక్షల్లో వైరస్ బారిన పడ్డారు. ప్రపంచం మొత్తంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్న సంగతి మీకు తెలిసిందే.

130కి పైగా ఉన్న అమెజాన్ గిడ్డంగుల్లో సుమారు 30పైగా కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు వర్కర్స్ రైట్స్ గ్రూప్,యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్ తెలిపింది. అయితే తాజా పరిణామాలపై యాజమాన్యం ఇంకా స్పందించలేదు, టెంపరేచర్ చెకింగ్, మాస్క్‌లు, శానిటైజేషన్ వంటి ప్రక్రియలను చేపడుతున్నామని గతంలో ప్రకటించింది. మరోవైపు ఈ ఆరోపణలపై నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

click me!