షాకింగ్: ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్ డౌన్ కొనసాగవచ్చన్న ఆరోగ్య శాఖా మంత్రి!

By Sree sFirst Published Apr 4, 2020, 3:26 PM IST
Highlights

మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనల దెబ్బకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశమంతా ఎక్కువయిపోయాయి. ఇలా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను పొడిగించాలని భావిస్తుంది మహారాష్ట్ర సర్కార్. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. . 

కరోనా మహమ్మారి ప్రపంచంతోపాటుగా భారతదేశాన్ని కూడా వణికిస్తోంది. భారతదేశంలో అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్ళివచ్చినవారి వల్ల వైరస్ దేశమంతా వ్యాపించింది. 

మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనల దెబ్బకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశమంతా ఎక్కువయిపోయాయి. ఇలా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను పొడిగించాలని భావిస్తుంది మహారాష్ట్ర సర్కార్. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. . 

ఇలా కేసులు పెరుగుతుండడంతో... ఒకే సారి లాక్ డౌన్ ఎత్తేస్తే ప్రజలు అందరూ  బయటకు వస్తే కరోనా వైరస్ అరికట్టడానికి తీసుకున్న చర్యలపై అధిక ప్రభావం పడే ఆస్కారం ఉందని ఆయన అన్నారు. అందువల్ల పరిస్థితి సద్దుమణిగేవరకు ఏప్రిల్ 14 తరువాత కూడా ఇలానే మరికొన్ని రోజులపాటు లాక్ డౌన్ కొనసాగించాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. 

ఇకపోతే... భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 12 గంటల్లో కొత్తగా 355 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం 2902 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 68కి చేరుకుంది. ఇప్పటి వరకు 229 మంది కోలుకున్నారు. మొదటి రెండు వారాలతో పోలిస్తే కేసుల సంఖ్యలో పెరుగుదల తగ్గింది.

కాగా, శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 478 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 2,547కు చేరుకుంది. ఇందులో 157 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 62 మంది మరణించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 68కి చేరుకుంది.

మహరాష్ట్రలో అత్యధికంగా 400కుపైగా కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానం తమిళనాడు ఆక్రమించింది. తమిళనాడులో 309 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. కేరళలో 286 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఢిల్లీలో 219 కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 172 కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మరణించారు. 

ఏప్రిల్ 3వ తేదీనాటికి తబ్లిగి జమాత్ కు సంబంధించినవే 647 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా 1,097,909 కేసులు నమోదు కాగా, వందలాది దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అమెరికా, ఇటలీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికాలో 276,995 కేసులు నమోదు కాగా, ఇటలీలో 119,827 కేసులు నమోదయ్యాయి. 

click me!