ఇక ముందు అదే బెస్ట్.. వర్క్ ఫ్రం హోమ్‌కే హైదరాబాదీ టెక్కీల ఓటు..

By Sandra Ashok Kumar  |  First Published May 14, 2020, 11:53 AM IST

ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా ఇంటి వద్ద నుంచి పని చేయడానికే ఐటీ ఉద్యోగులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకోవడానికి వర్క్ ఫ్రం హోంకే ఓటేస్తున్నారు. కంపెనీలు కూడా కరోనా లాక్ డౌన్ వల్ల వచ్చిన నష్టాలను తగ్గించుకునేందుకు తమ ఖర్చులు కుదించుకోవాలని యోచిస్తున్నాయి.


హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రభావం ఐటీ రంగ పరిశ్రమలకు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకుని నష్టాలు పూడ్చుకోవాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. మూడో దశ లాక్ డౌన్ వేళ 33 శాతం ఉద్యోగులతో ఆఫీసులను నడిపేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. 60శాతం కంపెనీలు ఎంప్లాయీస్​తో వర్క్ ఫ్రమ్​ హోమ్​ విధానాన్నే అమలు చేయిస్తున్నాయి.

లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసినా కొంతకాలం ఇదే పద్ధతి కొనసాగే అవకాశముందని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే టీసీఎస్ 2025 నాటికి 75 శాతం ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తారని ప్రకటించింది. మిగతా విప్రో, ఇన్ఫోసిస్ కూడా అదే బాటలో పయనించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

Latest Videos

తెలంగాణ రాజధాని​ ​భాగ్యనగరం​లో చిన్న, మధ్య తరహా, బహుళ జాతి సంస్థలకు చెందిన ఐటీ కంపెనీలు10 వేలకి పైగా ఉంటాయి. వాటిల్లో 6 లక్షల మంది నిపుణులు సేవలందిస్తున్నారు. 

ఈ నెల 11 నుంచి తక్కువ మంది ఉద్యోగులతో భౌతిక (సామాజిక) దూరం పాటిస్తూ ఐటీ కంపెనీలు రన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అయినా, అదనపు ఖర్చుగా భావిస్తున్న కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్​ హోమ్ బాటలోనే నడుస్తున్నాయి.

పెద్ద కంపెనీలు ఎంప్లాయీస్​కి ఫ్రీ ట్రాన్స్​పోర్ట్, అకామిడేషన్, ఫుడ్, క్యాంటీన్ వసతులు కల్పిస్తాయి. రిఫ్రెష్‌మెంట్ కార్యక్రమాల్లో భాగంగా వీకెండ్ పార్టీలు, మంత్లీ టూర్లు నిర్వహిస్తూ ఉంటాయి. 

also read  జియో కొత్త ఆఫర్..రిచార్జ్ ప్లాన్ ముగిశాక కూడా కాల్స్ చేసుకోవచ్చు...

వర్క్ ఫ్రమ్ హోమ్​తో ఆఫీస్​ మెయింటెనెన్స్ తోపాటు ఇప్పుడు ఆ అదనపు ఖర్చులన్నీ తగ్గిపోయాయని ఓ ఐటీ కంపెనీ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు.వర్క్ ఫ్రమ్ హోమ్​ చేస్తున్నా ప్రొడక్షన్​లో మార్పు లేదని ఓ ఐటీ కంపెనీ టీమ్​ లీడర్ తెలిపారు. తన టీమ్​లో 25 మందికి ఆన్ లైన్ వీడియో కాలింగ్ ద్వారా సజెషన్స్ ఇస్తూ వర్క్ చేయిస్తున్నట్లు చెప్పారు.

సర్వర్ అడ్మినిస్ట్రేషన్, క్లయింట్ బేస్డ్ సర్వర్ ప్లాట్​ఫామ్​పై పనిచేసే సిబ్బందికి కూడా కంపెనీలు డెస్క్ టాప్​లు ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్​ చేయిస్తున్నట్లు సదరు కంపెనీల టీం లీడర్లు పేర్కొన్నారు. ఎంప్లాయీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్​కు ఆసక్తి చూపుతున్నారు. 

గంటల తరబడి ట్రాఫిక్​లో ఇరుక్కుని ఆఫీసుకు వెళ్లడం కంటే ఇది బెస్ట్​ అంటున్నారు. లాక్ డౌన్ తర్వాత కూడా కంపెనీలు ఈ విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న కంపెనీలోని ఐటీ నిపుణుడు ఒకరు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల రోజులో ఓ గంట ఎక్కువగా పనిచేసే వీలుంటుందని, కంపెనీలకు ప్రొడక్షన్ వాల్యూ కలిసి వస్తోందని తెలిపారు.

‘పెద్ద కంపెనీలు 75శాతం ఎంప్లాయీస్​తో వర్క్ ఫ్రమ్ హోమ్​ చేయిస్తున్నాయి. రిసోర్సెస్ అంతా ఇంటి వద్దే పని చేస్తున్నా ప్రొడక్షన్​కి నష్టం లేదు’ అని విప్రో మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. 

కాకుంటే పని గంటలు పెరిగే అవకాశం కొంత ఉండొచ్చు.  లాక్ డౌన్ ఎత్తేసినా వర్క్ ఫ్రమ్ హోమ్​ కొనసాగేలా కనిపిస్తోంది’ అని విప్రో మేనేజర్ సంతోష్ కుమార్ చెప్పారు. ‘లాక్ డౌన్ స్టార్టింగ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ​చేస్తున్నా.  మొదట్లో సొంత ల్యాప్​టాప్​తోనే వర్క్​చేసినా, 15 రోజుల కిందట కంపెనీ నుంచి వచ్చింది. జూన్ 7వ తేదీ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని మా టీమ్​ లీడర్​ చెప్పారు’ అని ఓ ఐటీ ఎంప్లాయి వెల్లడించారు. 
 

click me!