డిల్లీలో డాక్టర్ కుటుంబానికి కరోనా పాజిటివ్ లక్షణాలు

By narsimha lodeFirst Published Mar 26, 2020, 11:35 AM IST
Highlights

కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న డాక్టర్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అతడిని క్వారంటైన్ కు తరలించినట్టుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

న్యూఢిల్లీ: కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న డాక్టర్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అతడిని క్వారంటైన్ కు తరలించినట్టుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్ మొహల్లాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కు కరోనా వ్యాధి సోకినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైద్యునితో పాటు అతని భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఈ ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించారు. మరో వైపు ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు డాక్టర్ ను  కలిసిన వారు ఎవరెవరు ఉన్నారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. 

ప్రాథమిక స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు మొహల్లా పేరిట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ డాక్టర్ కుటుంబం విదేశాల నుండి వచ్చిందా అనే విషయమై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. 
 

click me!