బ్రేకింగ్.. భారత్ లో వెయ్యి దాటిన కరోనా కేసులు

By telugu news teamFirst Published Mar 30, 2020, 7:51 AM IST
Highlights

ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 22 నమోదు అయ్యాయి. అయితే కేరళలో సైతం కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అక్కడ ఈ రోజు కొత్తగా 20 మందికి పాజిటివ్ వచ్చింది.

దేశంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం.. లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశము లో ఇప్పటివరకు కరోనా వైరస్ కేసులు సంఖ్య 1,024 కు పెరిగింది. అయితే ఈ వైరస్ ద్వారా మరణించిన వారి సంఖ్య 27 కి చేరింది. 

అయితే ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 85. అయితే ఇంకా 901 మంది వైద్యుల పర్యవేక్షణ లో చికిత్స పొందుతున్నారు.ఈ కరోనా వైరస్ కేసులు అత్యధికంగా మహారాష్ట్ర లో ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య 200 కి చేరుకుంది. 

Also Read కరోనా లాక్ డౌన్.. అంత్యక్రియలకు రాలేని పరిస్థితి.. ముస్లిం సోదరులే.....

ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 22 నమోదు అయ్యాయి. అయితే కేరళలో సైతం కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అక్కడ ఈ రోజు కొత్తగా 20 మందికి పాజిటివ్ వచ్చింది.

అక్కడ ఇప్పటివరకు 181 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక లో 76, తెలంగాణ లో 70, ఆంధ్ర ప్రదేశ్ లో 21 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో 18, పశ్చిమబెంగాల్‌లో 15, ఆంధ్రప్రదేశ్‌లో 16, లదాఖ్‌లో 13, బిహార్‌లో 9, చండీగఢ్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, హిమాచల్‌ ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, గోవాలో 3, పుదుచ్చేరిలో ఒకటి, మిజోరాంలో ఒకటి, మణిపూర్‌లో ఒకటి, అండమాన్‌ దీవుల్లో 2 కేసులు నమోదయ్యాయి.

అయితే ప్రపంచ దేశాలు సైతం ఈ వైరస్ భారిన పడి ఆందోళనా చెందుతున్నాయి. ఇప్పటివరకు 6,63,740 కేసులు నమోదు కాగా 30,879 మంది ఈ కరోనా వైరస్ కారణంగా మరణించారు.

click me!