భారత్ లో 24గంటల్లో 508 కొత్త కేసులు..124 మరణాలు

By telugu news team  |  First Published Apr 8, 2020, 8:07 AM IST

మహారాష్ట్రలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. ఇవాళ ఒక్కరోజే 150 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం ఒక వెయ్యి 18 కేసులు నమోదయ్యయి. కరోనాతో మహారాష్ట్రలో 48 మంది మృతి చెందారు. 
 


కరోనా మహమ్మారి భారత్ లో రోజురోజుకీ విజృంభిస్తోంది. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో వారంలో లాక్ డౌన్ ముగియనుండగా.. ఈ నేపథ్యంలో మరెన్ని కొత్త కేసులు నమోదౌతాయోనని ప్రజలు భయపడిపోతున్నారు.

Also Read 

Latest Videos

ఇదిలా ఉండగా...ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4789 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...4312 యాక్టీవ్ కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 124 మంది మృతి చెందగా 353 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడచిన 24 గంటల్లో 508 కొత్త కేసులు కాగా 13 మంది ప్రాణాలు కొల్పోయారు.

మహారాష్ట్రలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. ఇవాళ ఒక్కరోజే 150 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం ఒక వెయ్యి 18 కేసులు నమోదయ్యయి. కరోనాతో మహారాష్ట్రలో 48 మంది మృతి చెందారు. 

ముంబయి నగరంలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కేవలం ముంబయి నగరంలోనే ఇవాళ 100 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇప్పటి వరకువ  మొత్తం 590 మందికి కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి. ఒక్క ఈ నగరంలోనే కరోనా సోకి 40మంది ప్రాణాలు కోల్పోయారు.
 

click me!