ప్లాస్టిక్ బాటిల్స్ తో ఎలక్ట్రిక్ కారు.. అదరగొట్టిన విద్యార్థులు

By Sandra Ashok KumarFirst Published Nov 14, 2020, 11:23 AM IST
Highlights

లూకా అని పిలవబడే ప్రకాశవంతమైన పసుపు, స్పోర్టి ఎలక్ట్రిక్ టూ-సీటర్ కార్ 90 కిలోమీటర్ల వేగంతో, ఫుల్  ఛార్జ్ పై 220 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
 

ప్లాస్టిక్ వ్యర్ధ పదార్దాలతో రకరకాల వస్తువులను, ఉత్పత్తులను తయారు చేసినవై మీరు చూసుంటారు, అలాగే ప్లాస్టిక్ రోడ్ గురించి కూడా మీరు వినే ఉంటారు, కానీ వ్యర్ధ పదార్దాలతో తయారు చేసిన కారు మీరు చూసారా.. జర్మని లోని డచ్ విద్యార్థులు పూర్తిగా వ్యర్థాలతో తయారైన ఎలక్ట్రిక్ కారును సృష్టించారు.

వ్యర్థాలలో సముద్రం నుండి ప్లాస్టిక్, రీ-ఇసైకిల్ పిఇటి బాటిల్స్, ఇంట్లో ఉండే చెత్త ఉన్నాయి. 'లూకా' అని పిలవబడే ఈ కారు ప్రకాశవంతమైన పసుపు రంగులో స్పోర్టి టూ-సీటర్ కారు. గంటకు 90 కిలోమీటర్లు (56 మైళ్ళు) వేగంతో,  ఫుల్ ఛార్జ్ పై 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ఐండ్‌హోవెన్ టెక్నికల్ యూనివర్సిటీలోని ప్రాజెక్ట్ మేనేజర్ లిసా వాన్ ఎట్టెన్"ఈ కారు నిజంగా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది వ్యర్థాలతో తయారైంది, దీని చాసిస్ ఫ్లక్స్, రీసైకిల్ పిఇటి బాటిల్స్ తయారు చేయబడింది." అని చెప్పారు.  

also read 

కారు లోపలి భాగం కోసం మేము ఇంట్లో ఉండే వ్యర్థాలను ఉపయోగించారు. ఇందులో సాధారణంగా టిలిలు, బొమ్మలు, వంటగది ఉపకరణాలలో కనిపించే హార్డ్ ప్లాస్టిక్‌లను కారు బాడీ తయారీకి ఉపయోగించారు, కారు సీట్ల కోసం కొబ్బరి, గుర్రపు వెంట్రుకలు ఉపయోగించి తయారు చేశారు.

సుమారు 18 నెలల్లో 22 మంది విద్యార్థులు ఈ కారును రూపొందించి నిర్మించారు, వ్యర్థాల సామర్థ్యాన్ని నిరూపించే ప్రయత్నంగా దీనిని నిర్మించాము అని వాన్ ఎట్టెన్ అన్నారు.

"దీని ద్వారా కార్ కంపెనీలు వ్యర్థ పదార్థాలను ఉపయోగించడం ప్రారంభిస్తాయని మేము నిజంగా ఆశిస్తున్నాము, లోపలి భాగంలో ఎక్కువ కంపెనీలు వ్యర్థాలు లేదా బయో బేస్డ్ పదార్థాలను ఉపయోగిస్తాయి, అలాగే వాటి ద్వారా చాసిస్ నిర్మించడం కూడా సాధ్యమేనని మేము చూపించాలనుకుంటున్నాము." అని ఉత్పత్తి బృందం సభ్యుడు మాతిజ్ వాన్ విజ్క్ అన్నారు. 

click me!