బెస్ట్ పవర్ - పెర్ఫార్మెన్స్ కొత్త అర్ధం మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 434 మ్యాటిక్ కూప్...

By Sandra Ashok KumarFirst Published Nov 12, 2020, 4:16 PM IST
Highlights

పండుగ సీజన్ నేపథ్యంలో, మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు కొత్త కారును ఆవిష్కరించింది. మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 4మాటిక్ కూపే ఇండియన్ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. విలాసవంతమైన ఆటోమోటివ్ డిజైన్‌, డ్రైవింగ్ అద్భుతమైన ఆనందం. 
 

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు తన లైనప్ లో కొత్త కారును విడుదల చేసింది. పండుగ సీజన్ లో భాగంగా మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 4 మాటిక్ కూపే సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేస్తోంది. ఈ కారు లగ్జరీ ఆటోమొబైల్‌గా రూపొందించారు. దీనిని నడుపుతున్నప్పుడు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీని అత్యుత్తమ పనితీరుతో పాటు స్పొర్ట్స్, ఆడ్వేవేంచర్స్ ఇష్టపడే వారికి ఇది సరైన కారు. కొత్తగా ఆవిష్కరించిన ఎఎమ్‌జి జిఎల్‌సి 43 4మాటిక్  కూపే భారతదేశంలో తయారు చేయబడిన మొదటి ఎఎమ్‌జి కారు.

పవర్  అండ్ పెర్ఫార్మెన్స్
ఈ కారు పనితీరు విషయానికొస్తే, కారు డ్రైవింగ్ చాలా సౌకర్యవంతంగా ఉండేల రకరకాల డ్రైవింగ్ మోడ్‌లను అందించారు. ఇందులో ఇంటెలిజెంట్ బిల్ట్ ఇన్ కంట్రోల్ సిస్టంతో కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ +, ఇండివిజువల్, స్లిప్పరి  మోడ్ ఆప్షన్స్ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కారులో 2 టర్బోచార్జర్‌లతో పాటు 287 కిలోవాట్లను ఉత్పత్తి చేసే భారీ 3.0ఎల్ వి6 ఇంజన్ ఉంది. అంటే ఇది 390హెచ్‌పి, 250 ఎన్‌ఎం  ఉత్పత్తి చేయగలదు. ఈ కారు పనితీరు ప్రత్యేకమైనది. ఈ కారు కేవలం 0 నుండి 100 కిమీ వేగాన్ని 4.9 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కి.మీ.

 

రేస్ ట్రాక్ కోసం ఎస్‌ఎం‌జిని కారును రూపొందించారు. ఈ కారు ఔటర్ డిజైన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 4మాటిక్  కూపే పూర్తిగా రేస్ ట్రాక్ ద్వారా ప్రేరణ పొందింది. దీని డిజైన్  కొత్తగా రూపొందించిన ఏ- ఆకారంలో ఇంకా ఏ‌ఎం‌జి - రేడియేటర్ గ్రిల్‌తో ప్రారంభమవుతుంది. ఫ్రంట్ ఆప్రాన్లోని ఎయిర్ ఇంటెక్స్‌తో కొనసాగుతు, ఏ‌ఎం‌జి ఎగ్జాస్ట్ సిస్టమ్ ట్విన్ క్రోమ్ ప్లేటెడ్ టెయిల్ పైప్ ట్రిమ్ ఎలిమెంట్స్‌తో పాటు వెనుక భాగంలో డిఫ్యూజర్‌తో ఫినిషింగ్ ఉంటుంది.


ఏ‌ఎం‌జి నైట్ ప్యాకేజీ
కొత్త ఏ‌ఎం‌జి వెర్షన్ రాత్రిపూట డ్రైవింగ్ కోసం రూపొందించారు. అంటే, సరికొత్త మెర్సిడెస్ బెంజ్ - బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌సి 43 4మాటిక్ కూపే స్పోర్ట్స్ హై గ్లోస్ బ్లాక్ (బ్లాక్ గ్లోసీ)తో రూపొందించారు. ఫ్రంట్ ఆప్రాన్‌లో హై గ్లోస్ బ్లాక్ ఫ్రంట్ స్ప్లిటర్, వెనుక ఆప్రాన్‌లో హై గ్లోస్ బ్లాక్ ట్రిమ్‌తో కూడా డిఫ్యూజర్ బోర్డు రూపొందించారు.

లగ్జరీ ఇంటీరియర్
ఈ కారు లోపలి డిజైన్ కూడా విలాసవంతమైనది. సరికొత్త మెర్సిడెస్ బెంజ్ కారులో ఏ‌ఎం‌జి స్టిచింగ్ స్పోర్ట్స్ సీట్లు ఉన్నాయి. అదనంగా, బ్లాక్ నాపా లెదర్ స్టీరింగ్ వీల్ మంచి అనుభూతిని ఇస్తుంది. మీరు ఒకసారి కారులో కూర్చున్న తర్వాత, మీరు ప్రశాంతంగా ఎం‌బి‌యూ‌ఎక్స్ మల్టీమీడియా సిస్టమ్‌కు అంకితం అవుతారు, మెర్సిడెస్ మి కనెక్ట్ యాప్ సహజమైన ఆపరేటింగ్ కాన్సెప్ట్‌తో నావిగేషన్, కనెక్టివిటీని సులభతరం చేస్తుంది .

టెక్నాలజీ
మీరు వాహనంలోని ఏ వ్యక్తితోనైనా ప్రపంచంలోని ఏ మూల నుండి అయినా మెర్సిడెస్-మీ-కనెక్ట్ యాప్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ యాప్ ఒకే బటన్ తో చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, మా మొబైల్‌లోని కారును కారును ఆపే ఎంపికను అందించారు. కారు భద్రత కోసం ఈ ఫీచర్ అమలు చేశారు. మీరు ఒక ప్రాంతంలో చిక్కుకుంటే  మి కనెక్ట్ యాప్ నావిగేషన్‌కు సహాయపడుతుంది.

మెర్సిడెస్ మి కనెక్ట్ యాప్ తో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మీరు మీ కారుతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. మీరు కేవలం ఒక బటన్‌ తో సహాయం పొందవచ్చు, మీరు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఇరుక్కుపోతే నావిగేషన్, రోడ్‌సైడ్ సహాయం పొందడానికి మెర్సిడెస్ మీ కనెక్ట్ యాప్ సహాయపడుతుంది.

మీకు కారు కొనాలనే కోరిక ఉంటే, ఏ‌ఎం‌జి మోడల్ కారు కొనడం మంచిది. ఈ రొజే మీరు కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏ‌ఎం‌జి జి‌ఎల్‌సి 43 4 మాటిక్ కూపే  టెస్ట్ డ్రైవ్ చేయండి. దాని పనితీరు, పర్ఫర్మెంస్ మిమ్మల్ని ఎంతో   ఆకర్షిస్తుంది. 

click me!