పండగ సీజన్ లో కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ కార్లు మీకు బెస్ట్ ఆప్షన్ !

By Sandra Ashok Kumar  |  First Published Oct 10, 2020, 3:21 PM IST

పండుగ సీజన్ ప్రారంభం కానుంది, ఇందుకోసం కస్టమర్లను ఆకర్షించడానికి ఆటోమొబైల్ కంపెనీలు సన్నద్ధమయ్యాయి. వినియోగదారులకు వివిధ రకాల ఆకర్షణీయమైన ఆఫర్‌లను కూడా అందిస్తున్నారు. పండుగ సీజన్ లో  వాహనాల అమ్మకాలు ఏడాది మొత్తం కంటే ఇప్పుడే ఎక్కువ ఉంటాయి.


ప్రస్తుతం దసరా పండుగ సీజన్ ప్రారంభం కానుంది, ఇందుకోసం కస్టమర్లను ఆకర్షించడానికి ఆటోమొబైల్ కంపెనీలు సన్నద్ధమయ్యాయి. వినియోగదారులకు వివిధ రకాల ఆకర్షణీయమైన ఆఫర్‌లను కూడా అందిస్తున్నారు.

పండుగ సీజన్ లో  వాహనాల అమ్మకాలు ఏడాది మొత్తం కంటే ఇప్పుడే ఎక్కువ ఉంటాయి. మీరు కూడా ఈ సమయంలో కారు కొనాలని ఆలోచిస్తున్నారా పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతున్నందుకు ఎలా అని అనుకుంటున్నారా అయితే మీకు సి‌ఎన్‌జి కారు బెస్ట్ అని  చెప్పావచ్చు.

Latest Videos

కారు కొనడానికి ముందు, ఏ కారు కొనాలనే దానిపై ప్రజలకు ఎక్కువగా గందరగోళం ఉంటుంది. కారు కొనడానికి ముందు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని కారు కొన్న తర్వాత  కూడా మీరు చింతించకుండ ఉండడానికి మీరు కొనుగోలు చేయగల కొన్ని బెస్ట్ సి‌ఎన్‌జి కార్ల గురించి మీ కోసం...

also read 

1. మారుతి సుజుకి ఆల్టో సిఎన్‌జి: మారుతి సుజుకి ఆల్టో బిఎస్ 6 కంప్లైంట్ కారును ఈ సంవత్సరం జనవరిలో విడుదల చేసింది. ఆల్టో ఎస్-సిఎన్‌జి బిఎస్ 6ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. భారతదేశంలో సి‌ఎన్‌జి వెర్షన్‌ బిఎస్ 6 కంప్లైంట్ తో వచ్చిన మొదటి కారు ఇది.

ఆల్టో సిఎన్‌జి లో  రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఎల్‌ఎక్స్‌ఐ రెండోది ఎల్‌ఎక్స్‌ఐ  (ఓ). ఈ రెండిటిలో 796 సిసి ఇంజన్ ఉంది. బేసిక్ ఫీచర్లతో వచ్చే ఈ చిన్న కారు మీకు నాలుగున్నర లక్షల రూపాయల పరిధిలో లభిస్తుంది. ఈ కారు కిలో సిఎన్‌జితో 31.59 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

2. మారుతి వాగాన్ఆర్ సిఎన్‌జి: మీరు ఆల్టో కంటే కొంచెం పెద్ద కారును కొనాలని ఆలోచిస్తుంటే, ఇది మీకు గొప్ప ఆప్షన్ అని చెప్పావచ్చు. మారుతి వాగన్ఆర్ ఇప్పుడు సిఎన్‌జి లో కూడా వస్తుంది. ఈ కారులో మీకు ఎక్కువ ప్లేస్, స్టాండర్డ్ ఫీచర్స్  లభిస్తాయి.

మారుతి వాగాన్ఆర్ సిఎన్‌జి ఎల్‌ఎక్స్‌ఐ, ఎల్‌ఎక్స్ఐ (ఓ), వి‌ఎక్స్‌ఐ మొదలైన మోడళ్లను లభిస్తుంది. ఈ వాగన్ఆర్ కారును కంపెనీ అమర్చిన సిఎన్‌జితో పాటు అందిస్తారు. 998 సిసి పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. మీరు దీనిని 5 లక్షల రూపాయల పరిధిలో కొనొచ్చు. ఈ కారు సాధారణంగా కిలో సిఎన్‌జితో  33.54 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

3. హ్యుందాయ్ సాంట్రో సిఎన్‌జి: హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ కారు సాంట్రో కూడా సిఎన్‌జి కిట్‌తో మార్కెట్లో లభిస్తుంది. 1.1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు కిలో సిఎన్‌జితో 30 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీని ఇంజిన్ 58 బిహెచ్‌పి పవర్, 84 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5.85 లక్షలు.

click me!