ఆనంద్ మహీంద్రా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, పేదలకు సహాయం చేయడానికి నోట్లను ముద్రించాలని ప్రభుత్వాన్ని సూచించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించలేమని ఆనంద్ మహీంద్రా అన్నారు.
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, పేదలకు సహాయం చేయడానికి నోట్లను ముద్రించాలని ప్రభుత్వాన్ని సూచించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించలేమని ఆనంద్ మహీంద్రా అన్నారు.
కరోనా వైరస్, లాక్ డౌన్ దిగువ శ్రేణి ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పెద్ద నష్టాలను నివారించడానికి ప్రభుత్వం నోట్లను ముద్రించాల్సిన అవసరం ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎక్కువగా నష్టపోయారని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి, దేశ లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయి దీంతో ఉత్పత్తి, సరఫరా లేకపోవడం వల్ల ఎంఎస్‌ఎంఈ రంగంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయాయి. కరోనా వైరస్ ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించిన ప్రతిరోజూ సంపాదించే ప్రజలకు ఎక్కువ నష్టం కలిగించింది.
also read పెళ్లిరోజు సందర్భంగా హిరోయిన్ కి రూ.2.65 కోట్ల గిఫ్ట్.. ...
ఇండియా ఇన్వెస్ట్ 2020 ఫోరంలో ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్న పరిస్థితులు, దేశంలో పెరుగుతున్న ఆత్మహత్య కేసులు, మహిళల గృహ హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన లాక్ డౌన్ ఉన్నప్పటికీ భారతదేశంలో ఆర్థిక పునరుద్ధరణ జరుగుతోంది.
భారతదేశంలో ట్రాక్టర్లు, ఆటోమొబైల్ రంగాల అమ్మకాలు మెల్లిగా పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌లోకి వస్తుందనే ఆశలను పెంచుతోంది.
మహీంద్రా & మహీంద్రా గ్రూపుకు చెందిన ఆనంద్ మహీంద్రా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారన్న విషయం మీకు తెలిసిందే. గత నెలలో ఆనంద్ మహీంద్రా బీహార్ లోని గయాలో 3 కిలోమీటర్ల పొడవైన కాలువ తవ్విన రైతుకి ఆనంద్ మహీంద్రా ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చారు.