క్యాబ్ అగ్రిగేటర్ నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం కొత్త ఫీచర్‌తో ప్రయాణికులు వారి ప్రయాణాల రియల్ టైమ్ సమాచారం, ఎండ్-టు-ఎండ్ దిశలతో అన్నీ ఉబెర్ యాప్ లోనే ప్లాన్ చేసుకోవచ్చు.
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్), ఎల్ అండ్ టి మెట్రోల భాగస్వామ్యంతో హైదరాబాద్ ప్రయాణికుల కోసం ఉబెర్ యాప్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు ఉబెర్ గురువారం ప్రకటించింది.
క్యాబ్ అగ్రిగేటర్ నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం కొత్త ఫీచర్‌తో ప్రయాణికులు వారి ప్రయాణాల రియల్ టైమ్ సమాచారం, ఎండ్-టు-ఎండ్ దిశలతో అన్నీ ఉబెర్ యాప్ లోనే ప్లాన్ చేసుకోవచ్చు.
also read సైకిళ్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ : ఇండియాలో ఈ సైకిల్ ధర ఎంతంటే? ...
అక్టోబర్ 2019 లో ఢీల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సహకారంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫీచర్ మొదట ప్రారంభించిన తరువాత, ఉబెర్ ప్రస్తుతం హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్ అండ్ టి మెట్రో, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ల బస్సు సేవాతో కలిసి ఈ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.
ఉబెర్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ జర్నీ ప్లానింగ్ ఫీచర్ ప్రయాణికులు వేగవంతమైన, తక్కువ దూరం కలిగిన మార్గాలు, రియల్ టైమ్ షెడ్యూల్స్, చేరుకునే లేదా బయలుదేరే సమయాలు వంటి సమాచారం లభించనున్నది.
స్టార్ట్ / స్టాప్ కనెక్టివిటీకి సహాయపడటానికి రైడ్ షేరింగ్ మోడ్‌లను ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు తమ ప్రయాణాన్ని అనుకూలీకరించే అవకాశం ఉంటుంది. ఈ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫీచర్ అందిస్తున్న రెండో నగరం హైదరాబాద్ కావడం విశేషం.