ఫెస్టివల్ సీజన్ కోసం మెర్సిడేస్ బెంజ్ కొత్త క్యాంపెయిన్.. ఆద్భుతమైన ఫీచర్లతో ఆకర్షిస్తున్న లగ్జరీ కార్..

By Sandra Ashok Kumar  |  First Published Sep 16, 2020, 4:19 PM IST

 భారత్ ప్రస్తుతం నాలుగోదశ అన్ లాక్ ప్రక్రీయలో ఉంది. దాదాపు ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్వీసులు ఓపెన్ అయ్యాయి. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. నిబంధనలతో టూరింజంకు సంబంధించిన ప్రదేశాలను కూడా ప్రభుత్వసంస్థలు అనుమతిస్తున్నాయి.
 


ఈ పండుగ సీజన్ లో కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు మెర్సిడేస్ బెంజ్ ఇండియా `ఆన్ లాక్ విత్ మీ మెర్సిడేస్ - బెంజ్` పేరుతో ఓ కొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది. మీరు మీ కారు తలుపు మూసేసి ఎంతకాలం అవుతుంది. ఓ సాహస యాత్ర చేసి ఎన్ని రోజులైంది. ఈ మాటతో మీకు నిరుత్సాహం కలిగిందా. అయితే `ఆన్ లాక్ విత్ మీ మెర్సిడేస్ - బెంజ్` క్యాంపెయిన్ మీలో ఇంట్రస్ట్ను క్రియేట్ చేస్తుంది. భారత్ ప్రస్తుతం నాలుగోదశ అన్ లాక్ ప్రక్రీయలో ఉంది. దాదాపు ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్వీసులు ఓపెన్ అయ్యాయి. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. నిబంధనలతో టూరింజంకు సంబంధించిన ప్రదేశాలను కూడా ప్రభుత్వసంస్థలు అనుమతిస్తున్నాయి.

ఈ లాక్ డౌన్ సమయంలో `కార్ పే డ్రిమ్` అనే పదానికి మరింత అర్ధం వచ్చింది. ఈ సమయంలో ఇండియాలోనే లగ్జరీ కార్ల ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న మెర్సిడేస్ బెంజ్ కొత్త క్యాంపెయిన్ ప్రజల ముందుకు వచ్చింది. కస్టమర్లు కొత్త జర్నీలను కొత్త అంచనాలను అందుకునేందుకు మెర్సిడేస్ బెంజ్ `ఆన్ లాక్ విత్ మీ మెర్సిడేస్ - బెంజ్` అనే క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్ కస్టమార్స్  బెంజ్ కారు సొంతం  చేసుకోవటంతో సరికొత్త అనుభూతులను మిగులుస్తుందని సంస్థ తెలిపింది. 

Latest Videos

 మెర్సిడేస్ - బెంజ్ ఇండియా ఎం‌డి, సి‌ఈ‌ఓ  మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, ` `ఆన్ లాక్ విత్ మీ మెర్సిడేస్ - బెంజ్` ప్రచారం ఉద్దేశం ఏంటంటే.. వారి కోరికలు, ఆకాంక్షలు, కలలను ఆన్ లాక్ చేయడానికి  ప్రేరేపించడం ద్వారా కస్టమర్ల మనోభావాలను మార్చటం, కొత్తప్రయాణాలు, కొత్తరహదారులు, మెర్సిడేస్ తో  కొత్త సాహసకృత్యాలను కనుకొనటానికి వీలుకల్పిస్తుంది.

ఈ ప్రచారం ద్వారా వినియోగదారులకు ఆర్థిక, యాజమాన్య పరిష్కారాలకు కూడా సహాయపడుతుంది, ఈ క్యాంపెయిన్ పూర్తిగా కస్టమర్ల కోరికలు, ఆకాంక్షలను  ఆన్ లాక్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించాము` అని తెలిపారు.

మేర్సిడేస్ లగ్జరీ కార్లుపై  కొత్త ఆఫర్

 మెర్సిడేస్ - బెంజ్ కలల కారును సొంతం చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాన్నిఇస్తున్నారు. ఈ కార్లు లగ్జరీకి, స్టేటస్ కు గుర్తింపుగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కార్ లోని ఫీచర్స్ కస్టమర్లకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇంటి తరువాత కారే మీకు  బెస్ట్  స్టేటస్ అనిపించేంతగా  ఈ కార్లు  ఆకట్టుకుంటాయి. లగ్జరీ బ్రాండ్ల ఆఫర్ల కోసం, కస్టమర్లు వారి డ్రీం కారును సొంతం చేసుకునేందుకు రాబోయే పండుగ సీజన్ లో ఉత్తమమైన ఎంపిక.

`ఆన్ లాక్ విత్ మీ మెర్సిడేస్ - బెంజ్` క్యాంపెయిన్ ద్వారా కస్టమర్లకు లభించే  బెనిఫిట్స్:

సీ-క్లాస్:  39,999 నుండి ఈఐఎం మొదలు | ROI @ 7.99% | మూడు సంత్సరాల్లో కొత్త స్టార్ | తొలి సంవత్సరం కాప్లిమెంటరీ ఇన్సూరెన్స్
ఈ-క్లాస్ : 49,999 నుండి ఈఐఎంమొదలు | ROI @ 7.99% | మూడు సంత్సరాల్లో కొత్త స్టార్ | తొలి సంవత్సరం కాప్లిమెంటరీ ఇన్సూరెన్స్
జీఎల్సీ: 44,444  నుండి ఈఐఎం మొదలు | ROI @ 7.99% | మూడు సంత్సరాల్లో కొత్త స్టార్ | తొలి సంవత్సరం కాప్లిమెంటరీ ఇన్సూరెన్స్

ఆఫర్లతో పాటు మెర్సిడేస్  బెంజ్ కార్ ప్రత్యేకంగా చూపించే కొన్ని ఫీచర్స్:
కంఫర్ట్: కొనుగోలుదారులు కారులో చూసే మొదటి విషయాలలో  ఇది ఒకటి. మెర్సిడేస్  బెంజ్ డ్రైవర్లు,  ప్రయాణీకులకు అత్యధిక కంఫర్ట్ అందించే బెస్ట్ డిజైన్లకు ప్రసిద్ది చెందింది.

 

ఇన్నోవేషన్ అండ్ టేక్నాలజీ: మెర్సిడేస్  బెంజ్  టేక్నాలజీ, ఇన్నోవేషన్ లో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇది నేచురల్ వాయిస్ అసిస్ట్, రియర్ అండ్ ఫ్రంట్ పార్కింగ్ హెల్త్‌ లాంటి  టెక్నాలజీలు కలిగి ఉంది.

ఎంపిక: మెర్సిడేస్‌ బెంజ్‌లో సెడాన్ నుండి ఎస్‌యూవీ వరకు విస్తృత శ్రేణి కార్లను అందిస్తుంది, దీంతో కస్టమర్స్‌ తమకు బాగా సరిపోయే కారును ఎంచుకోవచ్చు. 

భద్రత: ప్రతి మెర్సిడెస్ బెంజ్ కారు పూర్తి భద్రత కోసం అనేక సార్లు పరీక్షలు జరుపుతారు. వారు ఏ‌బి‌ఎస్, ఏ‌డి‌ఎస్+, ఎయిర్ మాటిక్ సస్పెన్షన్ లాంటి చాలా భద్రత పరమైన అంశాలను కూడా అందుబాటులోకి తెచ్చారు.

బ్రేక్‌డౌన్  మేనేజ్‌మెంట్: కారు మిడ్-ట్రిప్‌లో డ్రైవర్ సమస్యలను ఎదుర్కొంటే, ఓవర్‌హెడ్ కంట్రోల్ యూనిట్‌లోని ఒక బటన్ అతన్ని రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఏజెంట్‌కు అనుసంధానిస్తుంది, దీని ద్వారా కస్టమర్‌ ఉన్న లోకేషన్‌ వారికి సరిగ్గా తెలుస్తుంది.

అత్యవసర కాల్ సేవలు: ఒకవేళ డ్రైవర్ వాహనంలోని ఎస్‌ఓ‌ఎస్ బటన్‌ను నొక్కినా లేదా వాహనం ప్రమాదానికి గురైనట్లుగా సెన్సార్లు గుర్తించినట్లయితే, వాహనం యొక్క డేటా మెర్సిడెస్ బెంజ్ అత్యవసర ప్రతిస్పందన కేంద్రానికి క్షణాల్లో చేరుతుంది. సహాయక చర్యలు నిమిత్తం వెంటనే ఏజెంట్లను పంపిస్తారు.

ఇన్ఫర్మేషన్ కాల్ సేవలు: వాహనంలోని టచ్ బటన్‌ను నొక్కితే, డైరెక్ట్‌గా మెర్సిడేస్‌ బెంజ్‌ కస్టమర్‌ కేర్‌ను  కాంటాక్ట్ చేయవచ్చు.ఇది కస్టమర్ అడిగే  ప్రశ్నలకు, సమస్యలకు సమాధానం ఇస్తుంది.

ఇన్ని ఆఫర్లు, అద్భుతమైన ఫీచర్లు ఉండగా ఇంకా ఆలొచించాల్సిన అవసరం లేదు. ఈ రోజే మీ ఇంటికీ మెర్సిడేస్‌ బెంజ్‌ను తెచ్చుకోండి.

click me!