మోడర్న్ సేఫ్టీ ఫీచర్లతో రెనాల్ట్ ‘కాప్చర్’

By Siva Kodati  |  First Published Apr 2, 2019, 12:49 PM IST

ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ ‘రెనాల్ట్’ మార్కెట్లోకి అభివ్రుద్ది చేసిన సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.9.5-రూ.13 లక్షల వరకు పలుకుతుంది.
 


ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ ‘రెనాల్ట్’సేఫ్టీ ఫీచర్లను అభివ్రుద్ధి చేసిన స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ‘కాప్చర్’ మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.5- రూ.13 లక్షల వరకు పలుకుతుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ఎక్సీడ్ ఫ్రంటల్, లాటరల్, పెడెస్ట్రైన్ సేఫ్టీ ఫీచర్లను చేర్చినట్లు రెనాల్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. 

వీటికి అదనంగా డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తోపాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), బ్రేక్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్, రేర్ పార్కింగ్ సెన్సర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ చేర్చారు.

Latest Videos

ఈ సేఫ్టీ ఫీచర్లు అన్ని వర్షన్లతో కూడిన న్యూ రెనాల్ట్ కాప్చర్ మోడల్ కార్లలో అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు పలు ప్రీమియం ఫీచర్లు కూడా చేర్చామని రెనాల్ట్ తెలిపింది.  

ఏపీలో ఆరు కేంద్రాల్లో ‘జొమోటో’ విస్తరణ
ఆన్‌లైన్‌ రెస్టారెంట్స్, ఫుడ్‌ డెలివరీ సేవల సంస్థ జొమాటో తన ఆన్‌లైన్‌ ఆర్డర్‌ సేవలు, ఫుడ్‌ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా 200కు పైగా పట్టణాలకు విస్తరించామని తెలిపింతా. నూతనంగా 17 పట్టణాల్లో సేవలు ప్రారంభించగా ఇందులో ఆరు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండడం గమనార్హం.

దీంతో తమ సేవలు అందుబాటులో ఉన్న పట్టణాల సంఖ్య 213కు చేరినట్టు వెల్లడించింది. దీంతో దేశ నలుమూలలా ఎర్ర చొక్కాతో కూడిన తమ డెలివరీ ఏజెంట్లను చూడొచ్చని పేర్కొంది.

కొత్తగా, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, ఒంగోలు, నంద్యాల, భీమవరం, మచిలీపట్నం, శ్రీకాకుళం, కేరళలోని కొట్టాయం, కొల్లామ్, పంజాబ్లోని ఖన్నా, గురుదాస్‌పూర్, తమిళనాడులోని అంబుర్, జార్ఖండ్‌లో దియోగఢ్, యూపీలో బులంద్‌షహర్, షాజహాన్‌పూర్‌ పట్టణాలు, హిమాచల్‌ ప్రదేశ్‌లో సోలన్, హర్యానాలో పల్వాల్‌లో తమ సేవలను ప్రారంభించినట్టు తెలియజేసింది. 
 

click me!