పక్షులు, జంతువుల కోసం తన మారుతి జిప్సీని విరాళంగా ఇచ్చిన బాలీవుడ్ హీరో

By Sandra Ashok Kumar  |  First Published Sep 9, 2020, 1:17 PM IST

మారుతి సుజుకి 4x4 ఎస్‌యూ‌వి కారును మహారాష్ట్రలోని జంతువుల సహాయక చర్యలు, వైద్య లాజిస్టిక్స్ కోసం ఉపయోగించేందుకు జాన్ అబ్రహం తన కారును ఏ‌ఎం‌టి‌ఎంకి అందజేశారు.  గత 5 సంవత్సరాలుగా   జాన్ అబ్రహం ఏ‌ఎం‌టి‌ఎం ఇండియాకు చేస్తున్న సహకారానికి మా కృతజ్ఞతలు. 


బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఇటీవల తను  బహుమతి పొందిన మారుతి సుజుకి జిప్సీని జంతు సంస్థ- యానిమల్ మ్యాటర్ టు మీ (AMTM) ఇండియాకు ఇచ్చేశారు.

సోషల్ మీడియాలో ఏ‌ఎం‌టి‌ఎం చేసిన పోస్ట్ ప్రకారం, మారుతి సుజుకి 4x4 ఎస్‌యూ‌వి కారును మహారాష్ట్రలోని జంతువుల సహాయక చర్యలు, వైద్య లాజిస్టిక్స్ కోసం ఉపయోగించేందుకు జాన్ అబ్రహం తన కారును ఏ‌ఎం‌టి‌ఎంకి అందజేశారు.  

Latest Videos

గత 5 సంవత్సరాలుగా   జాన్ అబ్రహం ఏ‌ఎం‌టి‌ఎం ఇండియాకు చేస్తున్న సహకారానికి మా కృతజ్ఞతలు. ఆయన అందిస్తున్న సహాయానికి మేము కృతజ్ఞతలు తెలుపుతు, రాబోయే సంవత్సరాల్లో మేము మా వంతు కృషి చేస్తాము" అని ఏ‌ఎం‌టి‌ఎం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది.

యానిమల్ మేటర్ టు మి అనేది నాన్ ప్రాఫిట్ సంస్థ. ముంబైకి చెందిన గణేష్ నాయక్ దీనిని స్థాపించారు. ఈ సంస్థ ప్రధానంగా జంతువులు, పక్షులు  సంక్షేమం కోసం పనిచేస్తుంది.

also reaad  

కోవిడ్-19 మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఎక్కువగా బయట తిరిగే జంతువులకు, పక్షులకు ఆహార కొరత ఏర్పడింది. వీటి సంరక్షణ కోసం జాన్ అబ్రహం కొన్ని సంవత్సరాలుగా ఏ‌ఎం‌టి‌ఎం సంస్థకు సపోర్ట్ చేస్తున్నారు.

జాన్ అబ్రహంకు  కార్లు, బైకులు అంటే ఎంతో ఇష్టం.  నిజానికి జాన్ అబ్రహం మొదట మోడలింగ్ ప్రారంభించినప్పుడు కొన్న  మొదటి వాహనాల్లో మారుతి జిప్సీ ఒకటి.  జాన్ అబ్రహం గ్యారేజీలో లంబోర్ఘిని గల్లార్డో, ఆడి క్యూ 7, నిస్సాన్ జిటి-ఆర్ వంటి సూపర్ కార్లు కూడా ఉన్నాయి, కానీ జిప్సీ మాత్రం తనకు చాలా ప్రత్యేకమైనది.

జాన్ సూపర్ బైక్ కలక్షన్లలో కవాసకి నింజా జెడ్ఎక్స్ -14 ఆర్, అప్రిలియా ఆర్ఎస్వి 4 ఆర్ఎఫ్, యమహా - వైఎఫ్జెడ్-ఆర్ 1, డుకాటీ పానిగలే వి4, ఎంవి అగస్టా ఎఫ్3 800, యమహా వి మాక్స్ ఉన్నాయి. మడ్రాస్ కేఫ్, ఫోర్స్, బట్ల హౌస్ వంటి జాతీయ చిత్రాలలో నటించిన జాన్ అబ్రహం తాజాగా సంజయ్ గుప్తా కొత్త సినిమా ముంబై సాగాలో కనిపించనున్నారు.

click me!