ఓలా యాప్‌లో కొత్త ఫీచర్‌..డ్రైవర్లకు నచ్చినంత ఇవ్వొచు...

Ashok Kumar   | Asianet News
Published : Jul 02, 2020, 04:32 PM ISTUpdated : Jul 02, 2020, 10:52 PM IST
ఓలా యాప్‌లో కొత్త ఫీచర్‌..డ్రైవర్లకు నచ్చినంత ఇవ్వొచు...

సారాంశం

 ప్రపంచవ్యాప్తంగా ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు  రైడ్ హెయిలింగ్ మేజర్ ఓలా మంగళవారం తెలిపింది. ఈ ఫీచర్ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఓలా వినియోగదారులందరికీ అందుబాటులోకి ఉంచింది. 

న్యూ ఢీల్లీ: నగరంలోని ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా క్యాబ్ డ్రైవరుల సేవలకు కృతజ్ఞతా తెలియజేయడానికి వినియోగదారుల అదనపు మొత్తాన్ని(టిప్‌) చెల్లించడానికి  ప్రపంచవ్యాప్తంగా ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు  రైడ్ హెయిలింగ్ మేజర్ ఓలా మంగళవారం తెలిపింది.

ఈ ఫీచర్ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఓలా వినియోగదారులందరికీ అందుబాటులోకి ఉంచింది. దీని వల్ల 25 లక్షల పైగా ఉన్న ఓలా క్యాబ్  డ్రైవర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ఓలా ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఫీచర్ కస్టమర్లకు తమ కృతజ్ఞతను తెలియజేయడానికి, సురక్షితమైన, అధిక-నాణ్యత గల రైడ్ అనుభవాన్ని అందించినందుకు, అదనపు దూరం వెళ్ళినందుకు డ్రైవర్లకు స్వతంత్రంగా టిప్ ను రివార్డ్ గా ఇస్తుంది. కస్టమర్లు ఓలా క్యాబ్ డ్రైవర్లకు స్వచ్ఛందంగా టిప్ ఎంత ఎవ్వలో ఎంచుకోవచ్చు,

also read ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ లలో టిక్‌టాక్ స్టార్ల హల్ చల్.. ...

క్యాబ్ డ్రైవర్  రోజు ఆదాయంలో భాగంగా ఈ మొత్తం టిప్ వారి ఖాతాకు జమ అవుతుంది. ఓలా క్యాబ్ ప్రత్యర్థి ఉబెర్ రెండు సంవత్సరాల క్రితమే ఈ  టిప్పింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. అయితే ఈ సంవత్సరం జనవరిలో భారతదేశంలో ఈ ఫీచర్ తీసుకొచ్చింది.

"కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభం నుండి అవసరమైన వారందరికీ అవసరమైన రైడ్ అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. లాక్ డౌన్ సడలింపు తరువాత  సేవలు తిరిగి ప్రారంభమైనప్పుడు వారు కస్టమర్ల భద్రత కోసం వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టడం ఇంకా సౌకర్యవంతమైన రైడ్ అనుభవం అందించడానికి ప్రయత్నిస్తున్నారు" అని ఓలా స్పోక్స్ పర్సన్ అన్నారు.

మంగళవారం నుండి కాంటాక్ట్ లెస్ టిప్పింగ్ ఫీచర్ రైడ్ పూర్తి అయ్యాక పేమెంట్ చేసే చివరి భాగంలో కనిపిస్తుంది. కస్టమర్లు నిర్ణీత మొత్తాన్ని లేదా వారికి నచ్చినంత టిప్ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఇది ఓలా అన్ని క్యాబ్ విభాగాలలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
 

PREV
click me!

Recommended Stories

Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి
Maruti Grand Vitara : ఈ స్టైలిష్ కారును ఇప్పుడే కొంటే.. ఏకంగా రూ.2.19 లక్షల డిస్కౌంట్