ఆటోమొబైల్ రంగాన్ని వదలని కరోనా మహమ్మారి : ‘మే’కంటే జూన్ కాస్త బెటర్

By Sandra Ashok Kumar  |  First Published Jul 2, 2020, 2:19 PM IST

ఆటోమొబైల్ రంగంపై కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పోలేదు. జూన్ నెలలోనూ ఆయా సంస్థల విక్రయాలు పడిపోయాయి. కాకుంటే మే నెల కంటే జూన్ నెలలో మెరుగయ్యాయి.
 


న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇంకా ఆటోమొబైల్స్ సంస్థలు ఇంకా కోలుకోలేదు. జూన్ నెలలోనూ వాహనాల అమ్మకాలు అంతంతమాత్రంగానే జరిగాయి. అగ్రగామి ఆటోమొబైల్స్ సంస్థలు మారుతి సుజుకి, టయోటా, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయితే, మే నెల సేల్స్‌తో స్వల్పంగా కోలుకున్నాయి. 

మారుతి సుజుకి కార్ల విక్రయాలు 1,24 నుంచి 54 శాతం పడిపోయాయి. మే నెలతో పోలిస్తే అమ్మకాల్లో 13,888 కార్ల విక్రయంతో మెరుగు పర్చుకున్నది. ఆల్టో, వ్యాగన్ఆర్ కూడిన చిన్న కార్ల విభాగం అమ్మకాలు మాత్రం 44.2 శాతం పడిపోయాయి. 18,733 నుంచి 10,458 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. స్విఫ్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్, బాలెనో వంటి కంపాక్ట్ కార్ల విక్రయాలు 57.6 శాతం తగ్గాయి. దీంతో కంపాక్ట్ కార్ల విక్రయాలు 62,897 నుంచి 26,696 యూనిట్లకు చేరుకున్నాయి. యుటిలిటీ విభాగ వాహన విక్రయాలు 45.1 శాతం తగ్గిపోయాయి. 

Latest Videos

హ్యుండాయ్ మోటార్స్ ఇండియా విక్రయాలు సైతం 58,807 యూనిట్ల నుంచి 26,820 కార్లకు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు చెందిన 55 శాతం తగ్గిపోయాయి. మహీంద్రా కార్లు 42,547 యూనిట్ల నుంచి 19,358 యూనిట్లకు పడిపోయాయి. 

also read పల్లెల్లో ట్రాక్టర్లు, టూ వీలర్స్‌కు ఫుల్ డిమాండ్..ఎందుకంటే ? ...

హోండా కార్స్ విక్రయాలు దారుణంగా 86.44 శాతం పతనం అయ్యాయి. గతేడాది జూన్ నెలతో పోలిస్తే గత నెలలో కార్ల విక్రయాలు 10,314 నుంచి 1,398 యూనిట్లకు పతనం అయ్యాయి. టయోటా కిర్లోస్కర్ కార్ల విక్రయాలు 63.53 శాతం తగ్గి (10,603 నుంచి 3866) పోయాయి. ఎస్కార్ట్స్ ట్రాక్టర్స్ విక్రయాలు 8,960 యూనిట్ల నుంచి 10,851 యూనిట్లకు పెరిగాయి. 

ఎంఎస్‌ఎంఈలకు ప్రపంచ బ్యాంక్‌ రుణం
భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్‌ ముందుకు వచ్చింది. 15 కోట్ల ఎంఎస్ఎంఈలకు 75 కోట్ల డాలర్ల రుణం సమకూర్చనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో ఈ విలువ రూ.5,670 కోట్లు. వ్యాపారాన్ని ముందుకు నడిపించగల ఎంఎస్ఎంఈలకు కరోనా కష్టకాలంలో నిధుల లభ్యత పెంచేందుకు ఈ ఫండింగ్‌ దోహదపడనుంది.

చిన్న పరిశ్రమల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని భారత్‌లోని ప్రపంచ బ్యాంక్‌ డైరెక్టర్‌ జునైద్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. బ్యాంకులు, సిడ్బీ ద్వారా మార్కెట్లో ద్రవ్య లభ్యత పెంచేందుకు ఆర్బీఐ కూడా పలు చర్యలు చేపట్టిందన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత సామాజిక, వైద్య రంగాలకు ప్రపంచ బ్యాంక్‌ ఇప్పటికే 200 కోట్ల డాలర్ల ఫండింగ్‌ను ప్రకటించింది.

click me!