4 సెకన్లలో 100 కి.మీ స్పీడ్: భారత మార్కెట్లోకి పోర్షె 911 కార్లు

By rajesh yFirst Published Apr 12, 2019, 11:18 AM IST
Highlights

లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ న్యూ పొర్షె భారత విపణిలోకి రెండు నూతన శ్రేణి కార్లు ‘కారేరా ఎస్`, ‘కారేరా ఎస్ కాబ్రియోలెట్` కార్లను ప్రవేశపెట్టింది. వాటి ధరలు రూ.1.82 కోట్ల నుంచి రూ.1.99 కోట్ల వరకు పలుకుతాయి. 

ముంబై: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ  పోర్షె నూతన శ్రేణి 911 కార్లను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ.1.82కోట్ల నుంచి రూ.1.99 కోట్ల వరకు ఉంది. కారేరా ఎస్ వేరియంట్ ధర రూ.1.82 కోట్లు కాగా, కారేరా ఎస్ కాబ్రియోలెట్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించారు. పోర్షె 911లో ఇది ఎనిమిదోతరం కారు. 

దీనిని తొలిసారి 2018లో లాస్ఏంజెల్స్ ఆటో షోలో ప్రదర్శించారు. గత మోడల్ కంటే పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. ఇంజిన్, ఫ్రేమ్‌లో మాత్రం మార్పులు చేర్పులు చేశారు. 

సరికొత్త పోర్షె 911లో దీనిలో ఫ్యూయల్ ఇంజెక్షన్ వ్యవస్థ ఉన్న 3.0 లీటర్స్ సిక్స్ సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్ను అమర్చారు. దీనిలో కొనుగోలు దారుల అభిరుచిని బట్టి 7-స్పీడ్ మాన్యూవల్, 8 - స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ వ్యవస్థను అమర్చారు. 

గత మోడల్ కంటే ఇది 30బీహెచ్పీ శక్తి ఎక్కువ. ఈ రెండు వేరియంట్ల గరిష్ట వేగం గంటకు 307కిమీ, గంటకు 305 కిమీ వరకు ఉన్నాయి. 

వెనుకవైపు ఇంజిన్ కలిగిన ఈ కారు పాతవాటితో పోలిస్తే డిజైనింగ్లోనూ, టెక్నాలజీ పరంగా అప్ డేట్ చేసి విడుదల చేసినట్లు కంపెనీ ఇండియా డైరెక్టర్ పవన్ శెట్టి తెలిపారు. ఫస్ట్ జనరేషన్‌గా విడుదల చేసిన ఈ కారు కంపెనీకి చెందిన ఐకానిక్‌గా మారిందని, పాతవాటితో పోలిస్తే మరింత శక్తివంతంగా రూపొందించినట్లు ఆయన చెప్పారు. 

పాత మోడల్తో పోలిస్తే ఈ కొత్త వెర్షన్‌లో 30 హెచ్పీ శక్తి అధికంగా అంటే 450 హెచ్పీతో తయారు చేసింది సంస్థ. కేవలం నాలుగు సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 308 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. 
 

click me!