మెర్సిడెస్ బెంజ్ కొత్త కారు..5 సెకన్లలో 100 కి.మీ స్పీడ్..

By Sandra Ashok Kumar  |  First Published Jun 3, 2020, 12:22 PM IST

ఆటోమొబైల్ సంస్థలు యువతను లక్ష్యంగా చేసుకుని కార్లను విడుదల చేస్తున్నాయి. మెర్సిడెస్ బెంజ్ కారు జీఎల్ఈ ఎల్ డబ్ల్యూబీ ఎస్ యూవీ వేరియంట్లను ఆవిష్కరించింది. మరోవైపు నిస్సాన్ ఇండియా యువత కోసమే డాట్సన్ సరికొత్త వర్షన్ కారును విపణిలో ప్రవేశ పెట్టింది. 
 


న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా విపణిలోకి టాప్ ఎండ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్ లాంగ్ వీల్ బేస్ (ఎల్‌డబ్ల్యూబీ) జీఎల్ఈలను విడుదల చేసింది. కేరళలో మినహా జీఎల్ఈ మోడల్ కార్లు రూ.88.80 లక్షల నుంచి రూ.89.90 లక్షలకు లభ్యం అవుతాయి.

బీఎస్-6 ప్రమాణాలతోపాటు 6-సిలిండర్ ఇంజిన్లతో ఈ కార్లు రూపుదిద్దుకున్నాయని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. జీఎల్ఈ 450 4మేటిక్ (పెట్రోల్), 400డీ 4మేటిక్ (డీజిల్) వేరియంట్లలో లభ్యం అవుతాయి. 

Latest Videos

జీఎల్ఈ 450 4మేటిక్ ఎల్‌డబ్ల్యూబీ మోడల్ కారు 367 హెచ్పీ సామర్థ్యంతో 5.7 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుందని మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. అలాగే కొత్త జీఎల్ఏ 400 డీ 4 మేటిక్ ఎల్ డబ్ల్యూబీ 330 హెచ్పీ సామర్థ్యంతో 5.7 సెకన్లలో 100 కి.మీ. వేగం అందుకుంటుందని వివరించింది. 

also read మారుతికి గట్టి షాక్: మొదటి స్థానంలోకి దూసుకెళ్లిన హ్యుండాయ్..

ఈ రెండు కార్లు కొత్త వేరియంట్లలో ఆటో పార్క్ అసిస్ట్ 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, ఈజీ ప్యాక్ టైల్ గేట్, ముందు సీట్లకు మెమొరీ ప్యాకేజీ, ఎలక్ట్రికల్ సర్దుబాటుతో వెనుక సీట్లు, ఎలక్ట్రిక్ సన్ బ్లిండ్స్, పనోరమిక్ సన్ ఫ్రూప్, వైర్ లెస్ చార్జింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది. 

ఇదిలా ఉంటే డాట్సన్‌ రెడీ-గో హ్యాచ్‌బ్యాక్‌లో సరికొత్త వెర్షన్‌ను నిస్సాన్‌ మోటార్‌ ఇండియా విడుదల చేసింది. ఈ కొత్త కారు ధరలు రూ.2.83 లక్షల నుంచి రూ.4.77 లక్షల మధ్య ఉన్నాయి. కొత్త డాట్సన్‌ రెడీ-గో ను 0.8 లీటర్‌ పెట్రోల్‌, 1 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ వేరియంట్స్‌తో తెచ్చినట్లు తెలిపింది.

భారత్‌లో మారుతున్న యువత అభిరుచులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో రూపొందించినట్లు పేర్కొంది. ఎంట్రీ లెవల్‌ కారు రెడీ-గో లో.. ఎల్‌-షేప్డ్‌ డే టైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌, ఎల్‌ఈడీ ఫాగ్‌ లాంప్స్‌, పెంటాబ్లేడ్‌ డ్యూయల్‌ టోన్‌ వీల్‌ వర్‌తో 14 అంగుళాల వీల్స్‌, వాయిస్‌ రికగ్నిషన్‌తో 8 అంగుళాల టచ్‌ స్ర్కీన్‌ అడ్వాన్స్‌డ్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ సిస్టమ్‌ను రూపొందించినట్లు నిస్సాన్‌ తెలిపింది. 

click me!