మారుతి సుజుకి వాగన్ఆర్ ఎస్-సి‌ఎన్‌జి సేల్స్ రికార్డు.. బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్, మైలేజ్..

By Sandra Ashok Kumar  |  First Published Sep 25, 2020, 4:01 PM IST

. కొత్త సేల్స్ మార్క్ వాగన్ఆర్ సి‌ఎన్‌జి ప్యాసెంజర్ వెహికిల్స్ వాహన విభాగాలలో అత్యంత విజయవంతమైన సి‌ఎన్‌జి కారుగా మారుస్తుందని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి భారతదేశంలో మూడు జనరేషన్లలో 24 లక్షలకు పైగా వాగన్ఆర్ కార్లను విక్రయించింది.


ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వాగన్ఆర్ ఎస్-సి‌ఎన్‌జి కార్ల అమ్మకాలు మూడు లక్షల మైలురాయిని దాటిందని వాహన తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త సేల్స్ మార్క్ వాగన్ఆర్ సి‌ఎన్‌జి ప్యాసెంజర్ వెహికిల్స్ వాహన విభాగాలలో అత్యంత విజయవంతమైన సి‌ఎన్‌జి కారుగా మారుస్తుందని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి భారతదేశంలో మూడు జనరేషన్లలో 24 లక్షలకు పైగా వాగన్ఆర్ కార్లను విక్రయించింది.


మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "దాదాపు రెండు దశాబ్దాలుగా భారతదేశంలోని టాప్ 10 కార్లలో వాగన్ఆర్ నిలిచింది, 1999లో వాగన్ఆర్ ప్రారంభమైనప్పటి నుండి వాగన్ఆర్ 24 లక్షలకు పైగా కస్టమర్లను కలిగి ఉంది. వారిలో దాదాపు సగం మందికి ఇది మొదటి కారు.

Latest Videos

also read ఆశ్చర్యపరుస్తున్న ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూ‌వి కార్ ఫీచర్లు.. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం.. ...

మారుతి సుజుకి నుండి వచ్చిన ఐకానిక్ కారు 2000 నుండి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లలో నిలుస్తుంది. వాగన్ఆర్ ఎస్-సి‌ఎన్‌జి 3 లక్షల అమ్మకాల మైలురాయి మా విశ్వసనీయ కస్టమర్లు మాకు ఇచ్చిన అపారమైన విశ్వాసానికి మరో నిదర్శనం. మారుతి సుజుకి తన వినియోగదారులకు స్థిరమైన మొబిలిటీ ఎంపికలను అందించడానికి నిరంతరం కృషి చేసింది " అని అన్నారు.

మారుతి సుజుకి వాగన్ఆర్ రెండు వెర్షన్లలో 1.0-లీటర్, 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ లో విక్రయిస్తుంది. ఎస్-సిఎన్‌జి వెర్షన్ 1.0-లీటర్ పెట్రోల్ మోటారు 58 బిహెచ్‌పి, 78 ఎన్ఎమ్ పీక్ టార్క్ను అభివృద్ధి చేస్తుంది. ఇందులో  ఎల్‌ఎక్స్‌ఐ, ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) వెరీఎంట్ లో అందిస్తున్నారు. వాగన్ఆర్ ఎస్-సి‌ఎన్‌జి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ లో మాత్రమే వస్తుంది.

మారుతి సుజుకి వాగన్ఆర్ ఫీచర్స్
డ్రైవర్-సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఎబిడి విత్ ఇబిడి, హై స్పీడ్ అలర్ట్, సీట్‌బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఇంకా మరెన్నో ఫీచర్స్ తో వస్తుంది. ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) వేరీఎంట్ లో ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, కొత్త ఫీచర్లు కూడా లభిస్తాయి. మారుతి సుజుకి వాగన్ఆర్ ఎస్-సిఎన్‌జి కిలోకు 33.54 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది, ఇది అత్యంత పొదుపు వాహనాలలో ఒకటిగా నిలిచింది.
 

click me!