హర్యానాలోని మానేసర్ ప్రొడక్షన్ ప్లాంట్‌లో దేశంలోకెల్లా అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. గుర్‌గ్రామ్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తే దేశవ్యాప్తంగా 300కి పైగా డీలర్‌షిప్‌లకు మారుతి సుజుకి కార్లను పంపిణీ చేయనున్నది. బుధవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో మారుతి సుజుకి షేర్లు దాదాపు 5 శాతం పెరిగాయి.
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి హర్యానాలోని మనేసర్ ప్లాంట్‌లో మంగళవారం ఉత్పాదక కార్యకలాపాలు ప్రారంభించింది. కరోనా వైరస్ కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల 50 రోజుల క్రితం మారుతి సుజుకి తన కంపెనీని మూసివేసింది.
తాజాగా ఒకే షిఫ్ట్ పద్ధతిలో మారుతి సుజుకి తన ఉత్పత్తి కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఇతర కార్ల తయారీ సంస్థలు హ్యుండాయ్, టయోటా, రెనాల్ట్, నిస్సాన్ కూడా పాక్షికంగా ఉత్పాదక కార్యకలాపాలు ప్రారంభించాయి.
undefined
రెండు షిప్టుల పని విధానంలో మారుతి మానేసర్ ప్రొడక్షన్ ప్లాంట్ నుంచి ఏడాదికి 15.5 లక్షల యూనిట్లు ఉత్పత్తి అవుతాయి. కరోనా ‘లాక్ డౌన్’ వల్ల 40 పని దినాలు కోల్పోయింది. కరోనా వైరస్ వెలుగు చూడడంతో మార్చి 22వ తేదీ నుంచి హర్యానాలోని మానేసర్, గురుగ్రామ్ ప్లాంట్లను మూసివేసింది.
also read మార్కెట్లోకి వోక్స్ వ్యాగన్ సరికొత్త కార్లు.. ఓన్లీ లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే..
‘ఎస్-క్రాస్’, ‘విటారా బ్రెజ్జా’, ‘ఇగ్నిస్’, సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వాహనాలు ఉత్పత్తి చేసే గురుగ్రామ్ ప్లాంట్‌ను మాత్రం మారుతి ఇప్పటి వరకు తెరవలేదు. మానేసర్ ఉత్పాదక యూనిట్‌లో 4,696 మందికి సిబ్బందికి కేవలం 2,500 మంది కార్మికులు మాత్రమే పని చేస్తున్నారు. మున్ముందు పని చేసే ఉద్యోగుల సంఖ్య దశలవారీగా పెంచుతామని మారుతి సుజుకి వెల్లడించింది.
గుర్‌గ్రామ్ ఉత్పాదక యూనిట్ నుంచి పనులు ప్రారంభించడానికి జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతి తీసుకున్నట్లు మారుతి సుజుకి ఓ ప్రకటనలో తెలిపింది. కార్మికుల మధ్య భౌతిక (సామాజిక) దూరం పాటించడం వంటి భద్రతా చర్యలతో గుర్ గ్రామ్ యూనిట్ పనులు ప్రారంభం కానున్నాయి. మానేసర్ తోపాటు గుర్ గ్రామ్ యూనిట్లలో పారిశ్రామిక ఉత్పత్తి మొదలైతే దేశవ్యాప్తంగా 2000 డీలర్ షోరూములకు కార్ల సరఫరా ప్రారంభం కానున్నది.
మారుతి సుజుకి ఆర్థిక ఫలితాలు బుధవారం వెల్లడించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ షేర్ మార్కెట్లో 4.58 శాతం పెరిగాయి. మారుతి సుజుకితోపాటు హీరో మోటో కార్ప్స్ షేర్ 4.57 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 4.50 శాతం, భారత్ ఫోర్జ్ షేర్ 4.38 శాతం, అపొలో షేర్ 4.23 శాతం, బజాజ్ ఆటో షేర్ 3.8, మథర్ సన్ సమీ సిస్టమ్స్ 3.6, టీవీఎస్ మోటార్స్ 2.99 శాతం పెరిగాయి.