భద్రతకు బెస్ట్..5జీ టెక్నాలజీ కార్లు .. ఫ్యూచర్ వాటిదే

By narsimha lode  |  First Published May 10, 2020, 11:38 AM IST

ఆటోమొబైల్ రంగంలో ‘5 జీ’ ఇంటర్నెట్‌ విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నది. వేగంగా దూసుకెళ్లే కార్లతోపాటు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లకు ‘5జీ’ టెక్నాలజీ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేస్తున్నారు. 


న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగంలో ‘5 జీ’ ఇంటర్నెట్‌ విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నది. వేగంగా దూసుకెళ్లే కార్లతోపాటు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లకు ‘5జీ’ టెక్నాలజీ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేస్తున్నారు. దీని వల్ల ఓ రోడ్డు మీద వెళుతున్న వాహనాలు ఒకదానికొకటి అతివేగంగా సమాచారం ఇచ్చి పుచ్చుకుంటాయి. 

తద్వారా తమకు ఎదురయ్యే ప్రమాదాలను ముందే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వాహనాలు ప్రమాదాల నుంచి తప్పించుకోగలవు. ఎదురుగా రోడ్డుపై గుంతలు వున్నా, రోడ్డుకు అడ్డుగా ప్రమాదకరమైనవి ఏవీ ఉన్నా, ముందుగా వెళ్లిన వాహనాల ద్వారా వెనకాల వచ్చే వాహనాలు తెలుసుకునే వెసులుబాటు 5జీ టెక్నాలజీ కల్పిస్తోంది.  

Latest Videos

undefined

‘5 జీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలు మరింత ఎక్కువగా, సమర్థంగా ఉపయోగించుకోగలవని గ్లాస్గో కెలెడోనియన్‌ యూనివర్శిటీ (జీసీయూ) నిపుణలు చెప్పారు. ‘టెస్లా లాంటి కార్లు భవిష్యత్‌లో 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని తమ చుట్టూ కొన్ని చదరపు మైళ్ల విస్తీర్ణంలో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాయి’ అని భవిష్యత్‌ కార్ల పరిశోధనా బృందం సభ్యుడు డాక్టర్‌ డిమిట్రియాస్‌ లయరోకాపిస్‌ చెప్పారు. 

‘వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్డును మంచు కప్పేసిందా ? గాలి దుమారం ఎదురుకానుందా? అన్న విషయాలను ముందుగానే తెలుసుకొని వాటికి అనుగుణంగా స్పందిస్తాయి’ భవిష్యత్‌ కార్ల పరిశోధనా బృందం సభ్యుడు డాక్టర్‌ డిమిట్రియాస్‌ లయరోకాపిస్‌ తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా 13 లక్షల మంది మరణిస్తుంటే, ఐదు కోట్ల మంది గాయాల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు చెబుతున్నాయి. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని వస్తున్న కొత్త కార్ల వల్ల ఈ ప్రమాదాలు గణనీయంగా పడిపోతాయని డాక్టర్‌ డిమిట్రియా చెప్పారు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ఫోర్డ్‌’ కంపెనీ ఇప్పటికే ఈ దిశగా పనులను చేపట్టింది. ఈ ఏడాది చివరి నాటికి తన కార్లలో 80 శాతం కార్లకు కొత్త 5జీ నెట్‌వర్క్‌ను అనుసంధించాలని లక్షంగా పెట్టుకుంది. 
 

click me!