కస్టమర్లను ఆకట్టుకొనేందుకు మారుతీసుజుకీ ఆఫర్లు...పాతవాహనాలపై ఎక్స్చేంజ్ కూడా...

By Sandra Ashok Kumar  |  First Published Jun 10, 2020, 12:29 PM IST

మారుతీసుజుకీ కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ఆఫర్లను ప్రకటిస్తోంది. తన ‘ఎస్‌ప్రెస్సో’ రకం కారుపై రూ.48 వేల తగ్గింపును ప్రకటించింది.  దీని ప్రకారం డీలర్‌ వద్ద కస్టమర్‌కు నేరుగా రూ.20వేల మేరకు క్యాష్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. 


న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీసుజుకీ కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ఆఫర్లను ప్రకటిస్తోంది. తన ‘ఎస్‌ప్రెస్సో’ రకం కారుపై రూ.48 వేల తగ్గింపును ప్రకటించింది.  దీని ప్రకారం డీలర్‌ వద్ద కస్టమర్‌కు నేరుగా రూ.20వేల మేరకు క్యాష్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. సియాజ్, ఆల్టో 800, సెలెరియో, వాగన్ ఆర్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా వంటి కార్లపై కూడా కొన్ని ఆఫర్లు ఇస్తోంది.

దీంతోపాటు పాతవాహనానికి ఎక్స్చేంజ్ చేసి మరో రూ.20 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. వీటికి తోడు యాక్ససిరీస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ వంటివి మరికొన్ని కలిపి మరో రూ.8,000 వరకు వినియోగదారుడికి మిగలనున్నది. ప్రస్తుతం మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.69 లక్షల నుంచి రూ.4.91లక్షల వరకు ఉంది. 

Latest Videos

undefined

ఈ కారును సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతి నెల విక్రయాల్లో 10 వేల మేరకు పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో విదేశాలకు ఎగమతి కూడా ప్రారంభించారు. ముఖ్యంగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఈ కారును ఎగుమతి చేస్తున్నారు. ఈ కారులో కంపెనీ 1.0లీటర్‌ కె10 ఇంజిన్‌ అమర్చారు. ఇది 67 బీహెచ్‌పీ శక్తివిడుదల చేస్తుంది. 5,500 ఆర్‌పీఎం వద్ద 90ఎన్‌ఎం టార్క్‌ విడుదలవుతుంది. 

also read వాహన పత్రాల వాలిడిటీ మరోసారి పొడిగింపు..సెప్టెంబర్ 30 వరకు అవకాశం..

మరోవైపు మారుతి సుజుకి ఇండియా వినియోగదారులకు రుణాలు మంజూరు చేసేందుకు మహీంద్రా ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపింది. కరోనా సంక్షోభంతో ద్రవ్య లభ్యత సమస్యను ఎదుర్కొంటున్న వినియోగదారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని మారుతి తెలిపింది.

దేశవ్యాప్తంగా నెట్ వర్క్ కలిగి ఉన్న మహీంద్రా ఫైనాన్స్.. గ్రామీణ, సెమీ రూరల్ సహా అన్ని వర్గాల ఆదరణను చూరగొన్నదని మారుతి అభిప్రాయ పడింది. మారుతి రిటైల్ విక్రయాల్లో మూడోవంతు గ్రామాల్లోనూ నమోదవుతున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. 

ఈ ఒప్పందం వల్ల వినియోగదారులకు తాము మరింత చేరువయ్యేందుకు వీలవుతుందని మారుతి సుజుకి పేర్కొన్నది. ‘బై నౌ- పే లేటర్’, స్టెప్ అప్ ఈఎంఐ, బెలూన్ ఈఎంఐ వంటి ఆఫర్లతో వినియోగదారులు కూడా లబ్ధి పొందుతున్నారని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. వాహనాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ ఒప్పందం వల్ల లబ్ధి చేకూరుతుందన్నారు. 

వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, రైతులు, వ్యాపార వర్గాలకు తమ రెండు సంస్థల భాగస్వామ్యం దోహద పడుతుందని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. మారుతి సుజుకి ఇండియాకు దేశవ్యాప్తంగా 3086 షోరూములు, మహీంద్రాకు 1450 శాఖలు ఉన్నాయి. 

click me!