మారుతి సుజుకిని వెంటాడుతున్న కరోనా వైరస్..సగానికి పైగా తగ్గిన అమ్మకాలు..

By Sandra Ashok Kumar  |  First Published Jul 1, 2020, 6:38 PM IST

యితే గత ఏడాది ఇదే జూన్‌ నెలలో కంపెనీ 1,24,708 యూనిట్లను విక్రయించినట్లు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ అమ్మకాలు గత నెలలో 53.7 శాతం క్షీణించి 53,139 యూనిట్లకు చేరుకోగా, 2019 జూన్‌లో 1,14,861 యూనిట్లుగా ఉంది.


దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా జూన్ నెల మొత్తం అమ్మకాలలో 54 శాతం క్షీణించి 57,428 యూనిట్లు  విక్రయించినట్లు తెలిపింది. అయితే గత ఏడాది ఇదే జూన్‌ నెలలో కంపెనీ 1,24,708 యూనిట్లను విక్రయించినట్లు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

దేశీయ అమ్మకాలు గత నెలలో 53.7 శాతం క్షీణించి 53,139 యూనిట్లకు చేరుకోగా, 2019 జూన్‌లో 1,14,861 యూనిట్లుగా ఉంది. గత నెలలో కంపెనీ 4,289 యూనిట్లను ఎగుమతి చేసిందని, 2019 జూన్‌లో 9,847 యూనిట్లను ఎగుమతి చేసిందని  మొత్తంగా పోల్చుకుంటే 56.4 శాతం సేల్స్ తగ్గిందని ఎంఎస్‌ఐ తెలిపింది.

Latest Videos

మారుతి ఆల్టో, వాగన్ఆర్లతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 10,458 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 18,733 యూనిట్ల సేల్స్ నమోదైందని తెలిపింది అంటే 44.2 శాతం సేల్స్ తగ్గాయి అని వెల్లడించింది. కాంపాక్ట్ విభాగంలో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడల్స్  అమ్మకాలు 57.6 శాతం క్షీణించి 26,696 యూనిట్లకు చేరుకున్నాయి.

also read 

గత ఏడాది జూన్ నెలలో 62,897 కార్లు అమ్ముడు పోయాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ కార్లను గత నెలలో 553 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు ఏడాది ఇదే నెలలో 2,322 యూనిట్లు విక్రయించగా, సేల్స్ ఈసారి 76.2 శాతం క్షీణించింది.

విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 45.1 శాతం క్షీణించి 9,764 యూనిట్ల వద్ద ఉండగా, అంతకుముందు నెలలో ఇది 17,797 గా ఉంది. జూన్ 30, 2020 తో ముగిసిన మొదటి త్రైమాసికంలో, మొత్తం అమ్మకాలు 76,599 యూనిట్లుగా ఉన్నాయని, 2019-20 ఇదే కాలంలో పోలిస్తే 4,02,594 యూనిట్లతో ఇది 81 శాతం తగ్గింది. 2020-21 మొదటి త్రైమాసికంలో అమ్మకాల పనితీరు కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి, లాక్ డౌన్ అమ్మకాలను దెబ్బతీసినట్లు కంపెనీ తెలిపింది. 

click me!