ఆన్ లైన్ క్లిక్స్ తెచ్చిన తంటా : అనుకోకుండా 28 కార్లు బుక్...

By Sandra Ashok KumarFirst Published Jun 29, 2020, 4:38 PM IST
Highlights

 కార్ల సేల్స్ విషయంలో కొత్తగా ఆన్ లైన్ ద్వారా కార్ బుక్ చేసుకుంటే కారు డెలివరీ అందించే వేసలుబాటును కస్టమర్లకు కల్పించింది. ఆన్ లైన్ బుకింగ్ వల్ల ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. జర్మనీలో ఒక వ్యక్తి అనుకోకుండా ఏకంగా ఆన్‌లైన్‌లో 28 టెస్లా మోడల్ 3 కార్లను బుక్ చేశాడు.

లేటెస్ట్ టెక్నాలజీ, లగ్జరీ కార్లకు మంచి పేరు పొందిన టెస్లా కంపెనీ. అయితే  కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆటోమొబైల్ రంగంలో కొన్ని మార్పులు వచ్చాయి. కార్ల సేల్స్ విషయంలో కొత్తగా ఆన్ లైన్ ద్వారా కార్ బుక్ చేసుకుంటే కారు డెలివరీ అందించే వేసలుబాటును కస్టమర్లకు కల్పించింది.

ఆన్ లైన్ బుకింగ్ వల్ల ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. జర్మనీలో ఒక వ్యక్తి అనుకోకుండా ఏకంగా ఆన్‌లైన్‌లో 28 టెస్లా మోడల్ 3 కార్లను బుక్ చేశాడు. వీటి ధర 1.4 మిలియన్ యూరోలు. కొన్ని నివేదికల ప్రకారం జర్మన్ కు చెందిన వ్యక్తి, అతని తండ్రి ఆటో పైలట్‌ టెస్లా మోడల్ 3  కారును కొనుగోలు చేయాలని భావించారు.  

అన్ని వివరాలను నింపిన కస్టమర్  చివరికి 'కన్ఫర్మ్' బటన్‌ను పదేపదే నొక్కేశాడు. దీంతో  ప్రతి క్లిక్‌తో మొత్తం 28 ఆర్డర్లు బుక్ అయిపోయాయి. ఫలితంగా 28 టెస్లా కార్లకు 1.4 మిలియన్ యూరోలు (సుమారు 11.9 కోట్ల రూపాయలు) బిల్లు చూసి అవాక్కయ్యాడు.

also read   

అంతేకాదు  ప్రతి ఆర్డర్‌కు కనీసం 100 యూరోల చొప్పున  నో రీఫండ్ ఫీజుగా 2,800 యూరోలు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

టెస్లా కంపెనీ వెబ్‌సైట్‌లో ఏర్పడిన లోపం  కారణంగా ఇలా జరిగి ఉండొచ్చు అని  ఒక ఇంగ్లిష్ వార్తా పత్రిక నివేదించింది. వెబ్‌సైట్‌లో  ఏర్పడిన లోపం రెండు గంటలపాటు ఉంది. దీనిపై కంపెనీ వెబ్‌సైట్ స్పందించి, టెస్లా 3 యూనిట్లలో 28ని బుక్ అయినట్టు తెలిపింది. వీటి మొత్తం ధర 1.4 మిలియన్ యూరోలు (సుమారు ₹ 11.9 కోట్లు).

అయితే, టెస్లా ఈ విషయాన్ని అంగీకరించింది, ఎటువంటి ఛార్జీ లేకుండా మొత్తం ఆర్డర్‌ను రద్దు చేసింది. మరోసారి కొనుగోలుకు కొత్త ఆర్డర్ ఇవ్వమని కోరింది. 

click me!