FY19: లక్ష దాటిన మారుతి‘సెలేరియో’ అమ్మకాలు

By rajesh y  |  First Published Apr 13, 2019, 12:51 PM IST

దేశీయ ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ‘శిఖ’లో మరో రికార్డు వచ్చి చేరింది. 2014లో విపణిలో అడుగు పెట్టిన ‘సెలెరియో’ మోడల్ కంపాక్ట్ కారు విక్రయాలు గతేడాది లక్ష యూనిట్ల విక్రయ లక్ష్యాన్ని దాటాయి.


న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కంపాక్ట్‌ మోడల్‌‌ మారుతి సుజుకి ‘సెలేరియో’ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం(2018-19)లో లక్ష మార్క్‌ను దాటాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,03,734 సెలేరియో వాహనాలను విక్రయించినట్లు ఆ సంస్థ తెలిపింది.

తొలిసారి ఈ మోడల్‌ను మారుతి సుజుకి 2014లో భారత విపణిలో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 4.7 లక్షల యూనిట్లను విక్రయించినట్లు మారుతి సుజుకి ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కంపాక్ట్‌ మోడల్‌ అమ్మకాలు 10 శాతం మేర పెరిగాయి. 

Latest Videos

ఈ కంపాక్ట్‌ మోడల్ ఆటో గేర్‌ షిఫ్ట్‌ సాంకేతికతో దేశీయంగా మార్కెట్‌లోకి విడుదలైన మొదటి కారు అని తెలిపింది. అందునా ఈ మధ్యకాలంలో ఆ కారు ప్రయాణంలో సేఫ్టీ కోసం పలు మార్పులతో ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్‌ చేసినట్లు ఎంఎస్‌ఐ మార్కెటింగ్‌, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఎస్. కల్సీ పేర్కొన్నారు. 

ఈ కంపాక్ట్‌ మోడల్‌లో అమర్చిన పెట్రోల్‌ ఇంజిన్ సాయంతో ఆటో గేర్‌ షిఫ్ట్‌, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్ రెండు వేరియంట్లలోనూ ఒక లీటర్‌ పెట్రోల్‌తో 23.1 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సీఎన్‌జీ వేరియంట్లలో ఈ ఫ్యూయల్‌ ఎఫీషియెన్సీ 31.76 కిలోమీటర్లుగా ఉన్నట్లు ఎంఎస్‌ఐ ప్రకటించింది. మారుతి సుజుకి బ్రాండ్‌కు చెందిన విటారా, బ్రెజ్జా, డిజైర్, బలేనో, స్విఫ్ట్‌, వేగనార్‌, ఆల్టో తదితర మోడళ్లు ఇప్పటికే లక్ష మార్క్‌ దాటిన జాబితాలో ఉన్నాయి.
 

click me!