ప్రభుత్వ ఉద్యోగులకు కార్ల కొనుగోలుపై 11,500 రూపాయల అదనపు తగ్గింపును కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా రుణలపై తక్కువ వడ్డీ రేటు, ఈజీ ఈఎంఐ సౌకర్యం కూడా అందిస్తుంది.
థార్, స్కార్పియో, బొలెరో వంటి శక్తివంతమైన ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా గ్రూప్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన ఆఫర్ ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కార్ల కొనుగోలుపై 11,500 రూపాయల అదనపు తగ్గింపును కంపెనీ ప్రకటించింది.
అంతేకాకుండా రుణలపై తక్కువ వడ్డీ రేటు, ఈజీ ఈఎంఐ సౌకర్యం కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమొబైల్ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 7.25% వరకు వడ్డీ రేటుతో ఆటోమొబైల్ రుణాలు ఇస్తామని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
పండుగ సీజన్ సేల్స్ లో ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఇందులో పర్సనల్ యుటిలిటీ వాహనాలపై ఎనిమిదేళ్ల వరకు నెలవారీ ఇఎంఐ కూడా ఇస్తుంది. ఈ స్కీంస్ లో కొన్నింటిని వివిధ ఆర్థిక సంస్థల ద్వారా అందిస్తున్నామని, అందువల్ల ఈ స్కీంస్ పొందటానికి వినియోగదారులు సమీప డీలర్‌తో సంప్రదించవలసి ఉంటుందని కంపెనీ తెలిపింది.
also read
ఇది మాత్రమే కాకుండా మహీంద్రా అనేక ఫిన్‌టెక్ కంపెనీల సహకారంతో వినియోగదారులకు కాంటాక్ట్‌లెస్ పేమెంట్ సేవలను కూడా అందిస్తుంది.
మహీంద్రా బుల్లెరో పై రూ .20వేల తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది. ఫెస్టివల్ సీజన్ లో మీరు బొలెరో తీసుకోవాలనుకుంటే, మీకు రూ.6,550 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఇవి కాకుండా రూ .10వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. మహీంద్రా స్కార్పియో కొనుగోలుపై కూడా ఆఫర్లు అందిస్తుంది.
మహీంద్రా థార్ ని కంపెనీ గత నెలలోనే లాంచ్ చేసింది. మహీంద్రా థార్ కేవలం ఒక నెలలోనే 20వేలకి పైగా బుకింగ్స్ అందుకుంది. మహీంద్రా థార్ డెలివరీకి ప్రస్తుతం 7 నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది.