Kia Carens 2023 కొత్త మోడల్ త్వరలోనే మార్కెట్లోకి విడుదల, ధర, ఫీచర్లు ఇవే..

By Krishna Adithya  |  First Published Mar 16, 2023, 1:46 PM IST

Kia Carens 2023 కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో సేల్స్ ప్రారంభించనున్నారు. దీని ధర రేంజ్ రూ.10.44 లక్షల నుంచి ప్రారంభించారు. అనేక కొత్త ఫీచర్లను సైతం ఈ కారులో జోడించారు. 


ఈ మధ్యకాలంలో కార్ల మార్కెట్లో కియా కారు ఎక్కువగా సందడి చేస్తోంది. ఇక్కడ చూసినా కియా కారు మోడల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కియా కార్లు సెక్యూరిటీ పరంగా, డిజైన్ పరంగా చాలా ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నాయని, ఈ కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కియా మార్కెట్లోకి మరో కొత్త కారును ప్రవేశపెట్టబోతోంది. ఈ కారు పేరు కియా కేరెన్స్. ఈ కారు ధర 10 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ కారు గురించి మరిన్ని విశిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాం. 

కారు ప్రియులకు పెద్ద వార్త రాబోతోంది. 2023 Kia Carens కొత్త మోడల్ భారతదేశంలో రూ.10.44 లక్షలకు ప్రారంభించబోతోంది. ఈ దక్షిణ కొరియా కార్‌మేకర్ దాని ఇంజన్  గేర్‌బాక్స్ లైనప్‌ను అప్ డేట్ చేయడం ద్వారా 2023కి కారెన్స్‌ను మార్కెట్ లోకి తేనుంది. దీనితో పాటు, కస్టమర్ల కోసం మరిన్ని ఫీచర్లు జోడించారు. 

Latest Videos

కొత్త Kia Carens 5 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ  లగ్జరీ ప్లస్. అన్ని వేరియంట్‌ల ధర రూ. 10.44 లక్షల నుండి రూ. 17.49 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు మారుతూ ఉంటుంది.

ఈ వేరియంట్‌లు ఇంజన్  ట్రాన్స్‌మిషన్ ఎంపికల ఆధారంగా విభజించారు. కియా 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను నిలిపివేసింది.అందుకు బదులుగా 158bhp  253Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో ముందుకు వచ్చింది. ఇదే ఇంజన్ కొత్త హ్యుందాయ్ అల్కాజార్  రాబోయే వెర్నాకు కూడా వాడటం విశేషం.

6 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి

Kia Carens కోసం మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికను కూడా నిలిపివేసింది  MPV iMT క్లచ్‌లెస్ మాన్యువల్‌ సిస్టం అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజిన్‌తో 7-స్పీడ్ DCT ఆఫర్‌లో ఉంది, డీజిల్ ఎంపిక కూడా IMT లేదా టార్క్ కన్వర్టర్‌ను పొందుతుంది. ఇది కాకుండా, కియా ABS, ESC, HAC, VSM, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, TPMS  వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన 6 ఎయిర్‌బ్యాగ్‌లను కూడా అందిస్తోంది. అన్ని ట్రిమ్‌లు కూడా 12.5-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను ప్రామాణికంగా పొందుతాయి.

 

click me!