కేవలం రూ. 25 వేలు చెల్లిస్తే చాలు హ్యుందాయ్ అల్కజార్ SUV కారు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..

By Krishna Adithya  |  First Published Mar 1, 2023, 5:10 PM IST

దక్షిణ కొరియా ఆటో బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ 2023 ఆల్కజార్ ఎస్‌యూవీని దేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మూడు వరుసల SUV కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. కొత్త మోడల్‌ను ఆన్‌లైన్‌లో లేదా అధీకృత సిగ్నేచర్ హ్యుందాయ్ డీలర్‌షిప్‌ల వద్ద రూ. 25,000 టోకెన్ మొత్తానికి బుక్ చేసుకోవచ్చు.


కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ తన సరికొత్త  SUV అల్కాజార్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. కొత్త ఇంజిన్‌ తో వస్తున్న ఆల్కాజర్‌తో తన రెండు ఇంజన్‌లకు అదనంగా కంపెనీ కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్‌ను పరిచయం చేస్తోంది. అప్ డేట్ చేసిన Alcazar కోసం బుకింగ్స్ తెరిచి ఉన్నాయి. కేవలం రూ. 25,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, "మేము హ్యుందాయ్ అల్కాజర్ ను మెరుగుపరిచాము. న్యూ ఏజ్ మొబిలిటీ సొల్యూషన్‌తో గ్రాండ్ అనుభవాన్ని అందించేందుకు కొత్త సాంకేతికతలను పరిచయం చేసామని తెలిపారు. 

హ్యుందాయ్ అల్కాజార్‌ను బుక్ చేయడానికి, కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ సిగ్నేచర్ అవుట్‌లెట్‌లను సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ కొత్త 160hp, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆల్కాజార్ SUV, మార్చి 21న విడుదల కానున్న సరికొత్త వెర్నా, క్రెటా SUV , సెల్టోస్ , కరెన్‌లతో కూడిన Kia లైనప్‌ తో పోటీ పడనుంది. 

Latest Videos

హ్యుందాయ్ అల్కాజార్ ఫీచర్లు
>> కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్‌తో, హ్యుందాయ్ అల్కాజార్ RDE కంప్లైంట్, E20 ఇంధనానికి అనుకూలంగా ఉంటుంది.
>> హ్యుందాయ్ అల్కాజర్ కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ని పొందింది.
>> కొత్త 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ కోసం క్లాస్ లీడింగ్ పవర్‌ను అందిస్తుంది.
>> కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కూడా RDE కంప్లైంట్ మరియు E20 (ఇథనాల్) ఇంధనం కోసం సిద్ధంగా ఉంది.
>> గేర్‌బాక్స్ ఎంపికలలో ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు కొత్త 7-స్పీడ్ DCT ఉన్నాయి, ఇది ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ 2.0 పెట్రోల్‌తో జతచేయబడుతుంది.
>> హ్యుందాయ్ ప్రకారం, అల్కాజార్ 1.5 టర్బో-పెట్రోల్ ఇంటిగ్రేటెడ్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కూడా పొందుతుంది.
>> 115hp, 250Nm మంచి 1.5-లీటర్ ఇంజన్ అల్కాజర్ డీజిల్ ఇంజిన్ తో వస్తోంది.

మైలేజీ ఎంత ఇస్తుందంటే..
కంపెనీ ప్రకారం, 7DCT ట్రాన్స్‌మిషన్ వేరియంట్ అత్యంత ఇంధన సామర్థ్య పవర్‌ట్రైన్, ఇది 20 kmpl మైలేజీని అందిస్తుంది. అయితే, 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 17.5 kmpl మైలేజీని అందిస్తుంది. ఇతర ఫీచర్లలో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, వాయిస్ కంట్రోల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవి ఉన్నాయి.
 

click me!