Maruti Suzuki Ignis: మార్కెట్లోకి సరికొత్త మారుతి ఇగ్నిస్, ధర కేవలం రూ. 6 లక్షల లోపు మాత్రమే, ఫీచర్లు ఇవే..

By Krishna Adithya  |  First Published Feb 28, 2023, 2:15 PM IST

సరికొత్త మారుతి సుజుకి ఇగ్నిస్, బీఎస్6 సెకండ్ ఫేజ్ ప్రమాణాలతోనూ, కొత్త సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది, దీని ధర రూ. 5.82 లక్షల నుండి ప్రారంభమవుతోంది. కొత్త మారుతి ఇగ్నిస్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 


BS6 ప్రమాణాల రెండవ దశ దేశంలో 1 ఏప్రిల్ 2023 నుండి అమలులోకి రాబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీదారులందరూ తమ వాహనాలకు సంబంధించిన అప్‌డేట్‌లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు.ఇందులో భాగంగా దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఇగ్నిస్ (2023 Version RDE Compliant Ignis) మోడల్ కారును RDE ఆధారిత ఇంజిన్‌తో మార్కెట్లోకి పరిచయం చేసింది. వాస్తవానికి BS4, BS6 ఉద్గార ప్రమాణాల కింద పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో నడిచే వాహనాల నుండి వెలువడే పొగ నాణ్యత పెంచడానికి సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్ (NO2) వంటి హానికరమైన వాయువుల స్థాయిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా కొత్త ఇగ్నిస్ విడుదల చేశారు. 

మారుతి సుజుకి ఇగ్నిస్ కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో విడుదల అవుతోంది. 
మారుతి సుజుకి అనేక కొత్త ఫీచర్లతో 2023 ఇగ్నిస్ మోడల్ కారును విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి అనేక కొత్త ఫీచర్లు కొత్త కారు మోడల్ కు జత చేశారు. ఇదే కాకుండా, ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్‌లో ట్విన్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ISOFIX చైల్డ్ సీట్ ఉన్నాయి. కంపెనీ ఈ స్టాండర్డ్ ఫీచర్లన్నింటినీ 2023 ఇగ్నిస్‌లో చేర్చింది. మారుతి సుజుకి ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే 4 వేరియంట్‌లలో లభిస్తోంది

Latest Videos

ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది కాకుండా, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, స్టార్ట్/స్టాప్ ఇగ్నిషన్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో ORVMలు, టిల్ట్ స్టీరింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్: RDE ఆధారిత ఇంజన్. ధర
మారుతి సుజుకి కొత్త ఇగ్నైట్ హ్యాచ్‌బ్యాక్‌ అప్ డేట్ చేసిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేసింది. ఈ ఇంజన్ 82బిహెచ్‌పి పవర్, 113ఎన్ఎమ్ టార్క్ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ ట్రాన్స్‌మిషన్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌ జత చేశారు.  నిజానికి ఇందులో ఓ ఆప్షన్ కూడా ఉంది. ధర పరంగా, పాత ఇగ్నిస్‌తో పోలిస్తే, మారుతి సుజుకి ఈ ఏడాది మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఇగ్నిస్ (2023 ఇగ్నిస్) ధర రూ. 27,000 ఎక్కువ.

కొత్త ఇగ్నైస్ నాలుగు వేరియంట్లు పాత మోడల్ కంటే కాస్త ఖరీదు ఎక్కువ. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అప్‌డేట్ చేసిన ఇగ్నిస్ ధర రూ.5.82 లక్షల నుండి రూ.7.59 లక్షల మధ్య ఉంది. AMT గేర్‌బాక్స్‌తో కూడిన హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 6.91 లక్షల నుండి రూ. 8.14 లక్షల మధ్యలో ఉంది. 

click me!