ఇండియాలోకి న్యూ జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌: ఎప్పుడంటే.?

By rajesh y  |  First Published Apr 13, 2019, 4:17 PM IST

అమెరికన్ ఎస్‌యూవీ తయారీ దిగ్గజం జీప్ ఎట్టకేలకు తన జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌ను భారతదేశంలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆటోకార్ ఇండియా కథనం ప్రకారం.. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌ ఈ ఏడాది జులై చివరి వారంలో లాంఛ్ చేయనుంది.


న్యూఢిల్లీ: అమెరికన్ ఎస్‌యూవీ తయారీ దిగ్గజం జీప్ ఎట్టకేలకు తన జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌ను భారతదేశంలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆటోకార్ ఇండియా కథనం ప్రకారం.. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌ ఈ ఏడాది జులై చివరి వారంలో లాంఛ్ చేయనుంది.

జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌ ఈ ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలోనే భారతదేశంలో ప్రవేశిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. అలా జరగలేదు. చాలా సార్లు వాయిదాలు పడ్డ తర్వాత.. ఈ ఏడాది జులైలో జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌ భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించనుంది. 

Latest Videos

తాజాగా జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌ అదనపు ఫీచర్లు వస్తోంది. కఠినమైన రోడ్లు, రాళ్లపై కూడా ఈ వాహనం సులువుగా ప్రయాణించగలదు. రెగ్యూలర్ కంపాస్ మోడల్స్ 225ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండగా.. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌ కు అదనంగా 20ఎంఎం ఉంది. ఎయిర్ ఇంటేక్ కూడా రెగ్యూలర్ మోడళ్ల కంటే ఎక్కువగానే ఉంది. 

కంపాస్ ఇతర మోడళ్ల కంటే కూడా  75ఎంఎం ఎక్కువ నీళ్ల లోతులోనూ  తాజా వాహనం ప్రయాణించగలదు. కఠినమైన భూ మార్గాల్లోనూ జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌ సునాయాసంగా నడవగలదు. లో రేంజి గేర్‌బాక్స్, రేర్ లాకింగ్ డిఫ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. రాక్ డ్రైవింగ్ మోడ్ అనే కొత్త ఫీచర్ కూడా ఇందులో అదనంగా ఉంది.

న్యూ ఫ్రంట్, రేర్ బ్లంపర్, రెడ్ కలర్ టౌ హుక్స్, ఆల్ వెదర్ టైర్స్, కారు బాడి కింద ముందు వెనుకాల స్కిడ్ ప్లేట్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఎస్ యూవీ బానెట్‌పై పెద్ద నలుపు బెకెల్ కూడా ఉంది. వాహనం లోపల ఆల్ వెదర్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్‌పై ట్రైల్ రేటెడ్ బ్యాడ్జ్ ఉంది.

జీప్ కంపాస్ ట్రైల్‌హాక్‌ ఎస్‌సీఏ 2.0లీటర్ టర్బో ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్, 3,750ఆర్పీఎమ్ వద్ద 171బీహెచ్‌పీ, 1,750ఆర్పీఎం వద్ద 350ఎన్ఎం. 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన తొలి జీప్ కంపాస్ మోడల్ ఇండియాలో ఇదే కావడం విశేషం.

click me!