హోండా కార్లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. ఏకంగా 2.5 లక్షల వరకు డిస్కౌంట్..

By Sandra Ashok Kumar  |  First Published Oct 5, 2020, 10:49 AM IST

హోండా కార్స్ ఇండియా దసరా పండుగ కోసం ఎంపిక చేసిన కార్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. జపనీస్ కార్ల తయారీ హోండా కంపెనీ కార్లపై  భారీ డీల్స్, డిస్కౌంట్  లాభాలతో కస్టమర్లను  ఆకర్షిస్తుంది.


దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ సమీపిస్తుండటంతో ఆటోమోబైల్ సంస్థలు సేల్స్ పెంచుకునేందుకు కస్టమర్లకు  డిస్కౌంట్లు, ప్రత్యేకమైన ఆఫర్లు ప్రవేశపెడుతున్నారు. తాజాగా హోండా కార్స్ ఇండియా దసరా పండుగ కోసం ఎంపిక చేసిన కార్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.

జపనీస్ కార్ల తయారీ హోండా కంపెనీ కార్లపై  భారీ డీల్స్, డిస్కౌంట్  లాభాలతో కస్టమర్లను  ఆకర్షిస్తుంది. హోండా కార్లపై లభించే ఈ ప్రత్యేకమైన ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజి బెనెఫిట్స్, అధిక వారంటీ ఉన్నాయి.

Latest Videos

also read 

ప్రస్తుత హోండా కస్టమర్లకు 6వేల లాయల్టీ బోనస్, 10వేల ఎక్స్చేంజ్ డిస్కౌంటును సెప్టెంబర్ నెల చివరి వరకు లేదా స్టాక్ ఉన్నంతవరకు  పొందవచ్చు. ఈ ఆఫర్లు హోండా అమేజ్, న్యూ-జెన్ సిటీ, కొత్త డబల్యూ‌ఆర్-వి, జాజ్, హోండా సివిక్ పై ఉన్నాయి.

హోండా అమేజ్ సబ్-కాంపాక్ట్ సెడాన్ పై 47వేల వరకు మొత్తం బెనెఫిట్స్ తో అదనపు వారంటీ ఇస్తున్నారు. పెట్రోల్ వెర్షన్‌పై  20వేల వరకు క్యాష్ బెనెఫిట్స్ లభిస్తుంది, అలాగే డీజిల్ వెర్షన్ పై 10వేల క్యాష్ డిస్కౌంట్  అందిస్తుంది.

హోండా కొత్త జనరేషన్ సిటీ సెడాన్ కార్ పై ఎక్స్ఛేంజ్ స్కీమ్ కింద 30వేల వరకు బెనెఫిట్స్ ఉన్నాయి. కొత్త వెర్షన్‌ హోండా డబ్ల్యూఆర్-వి, జాజ్ రెండింటిపై 25వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా హోండా సివిక్ సెడాన్ పై ఆన్‌లైన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో 2.5 లక్షల వరకు అద్భుతమైన ఆఫర్ ఆడిస్తున్నట్లు తెలిపింది.
 

click me!