రెనాల్ట్ క్విడ్‌ సరికొత్త లేటెస్ట్ లిమిటెడ్‌ ఎడిషన్.. స్టైలిష్, ఫ్రెష్ లుక్ తో లాంచ్..

By Sandra Ashok Kumar  |  First Published Oct 3, 2020, 11:20 AM IST

లిమిటెడ్-ఎడిషన్‌లో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ స్టైలిష్, ఫ్రెష్ డ్యూయల్-టోన్ ఎక్స్‌టిరియర్ ఉన్నాయి. కస్టమర్లు రెండు కలర్ కాంబినేషన్లలో కారును సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి  సిల్వర్ రూఫ్ తో జాన్స్కర్ బ్లూ బాడీ రెండోది జాన్స్కర్ బ్లూ రూఫ్ తో సిల్వర్ బాడీ.


న్యూ ఢీల్లీ: ఆటోమోబైల్ తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా క్విడ్‌ సరికొత్త లేటెస్ట్ నియోటెక్‌ 2020 ఎడిషన్‌   లాంచ్‌ చేసింది. 0.8 ఎల్ ఎమ్‌టి, 1.0 ఎల్ ఎమ్‌టి, 1.0 ఎల్ ఎఎమ్‌టి వేరియంట్లలో తీసుకొచ్చింది. లిమిటెడ్-ఎడిషన్‌లో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ స్టైలిష్, ఫ్రెష్ డ్యూయల్-టోన్ ఎక్స్‌టిరియర్ ఉన్నాయి.

కస్టమర్లు రెండు కలర్ కాంబినేషన్లలో కారును సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి  సిల్వర్ రూఫ్ తో జాన్స్కర్ బ్లూ బాడీ రెండోది జాన్స్కర్ బ్లూ రూఫ్ తో సిల్వర్ బాడీ. రెనాల్ట్ క్విడ్‌ 2020 నియోటెక్ కోసం 30వేల రూపాయలు అదనంగా  చెల్లించాల్సి ఉంటుంది.

Latest Videos

క్విడ్‌ నియోటెక్‌ ఎడిషన్ లో 8 అంగుళాల టచ్ స్క్రీన్ యూ‌ఎల్‌సితో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ముందు ప్రయాణీకుల కోసం యూ‌ఎస్‌బి సాకెట్, ఆక్స్ సాకెట్లు, ఫ్లెక్స్ వీల్స్, సి-పిల్లర్ పై 3డి డికాల్స్, నియోటెక్ డోర్ క్లాడింగ్స్, బ్లూ ఇన్సర్ట్స్ & బ్లూ కలర్ లో సీట్ ఫాబ్రిక్ మోడిఫికేషన్ స్టీచింగ్, క్రోమ్ ఏ‌ఎం‌టి డయల్, క్రోమ్ యాడ్-ఆన్ గ్రిల్, బి-పిల్లర్ బ్లాక్ ట్యాపింగ్ ఫీచర్స్ ఉన్నాయి.

also read 

2019లో రెనాల్ట్ ఇండియా సరికొత్త బోల్డర్, స్టైలిష్ క్విడ్‌ కారును ప్రవేశపెట్టింది, ఇందులో అనేక ఫస్ట్-క్లాస్ ఫీచర్స్ తో లోడ్ చేశారు. కొత్త ఆర్‌ఎక్స్‌ఎల్ వేరియంట్‌ను 1.0ఎల్ పవర్‌ట్రెయిన్‌లో ఎం‌టి, ఏ‌ఎం‌టి వెర్షన్లలో విడుదల చేసింది.

క్విడ్‌ కారులో 20.32 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ మీడియాఎనావ్ ఎవల్యూషన్, ఫస్ట్-ఇన్-ఎల్ఈడి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లోర్ కన్సోల్-మౌంటెడ్ ఏ‌ఎం‌టి డయల్, వన్-టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, స్పీడ్-డిపెండెంట్ వాల్యూమ్ కంట్రోల్,  279 లీటర్ల బూట్ సామర్థ్యం అందించారు.

రెనాల్ట్  క్విడ్‌ కారుపై 5 సంవత్సరాల వరకు ఆప్షనల్ ఎక్స్ టెండెడ్ వారంటీని, వాహన డెలివరీ తేదీ నుండి 100,000 కి.మీ అందిస్తున్నారు. బుకింగ్స్‌ అక్టోబర్‌ 1నుండి మొదలయ్యాయి. పండుగ సీజన్‌ సందర్భంగా కంపెనీ బ్రాండ్‌ ధరల్ని స్వల్పంగా పెంచింది. డెలివరీలు కూడా  త్వరలోనే ప్రారంభమవనున్నాయి. 

 

Here’s your first look at the New NEOTECH EDITION, in two new dual tone avatars with exterior body & roof combinations in Zanskar Blue & Moonlight Silver.
Know more: https://t.co/6wwDGislKZ pic.twitter.com/CzwYxVfYyI

— Renault India (@RenaultIndia)
click me!