దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ విపణిలోకి 2020 వెర్నా మోడల్ కారును విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.30 లక్షల నుంచి మొదలై గరిష్టంగా రూ.15.09 లక్షల వరకు పలుకుతుంది.
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి హ్యుండాయ్ మోటర్స్ మధ్యస్థాయి సెడాన్ వెర్నాలో సరికొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.9.3 లక్షల నుంచి రూ.15.09 లక్షల మధ్య ఉంటుందని హ్యుండాయ్ తెలిపింది.
బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసిన ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లో, లీటర్ టర్బో ఇంజిన్‌లోనూ లభించనున్నది. వీటిలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన కారు రూ.9.35 లక్షల నుంచి రూ.13.85 లక్షల లోపు, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ రూ.10.65-15.09 లక్షల లోపు, టర్బో ఇంజిన్ రకం మోడల్ రూ.13.99 లక్షలకు లభించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
undefined
ఈ నూతన మోడల్ వెర్నా కారులో వెంటిలేటెడ్ సీట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 20.32 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ చార్జింగ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అదనంగా నాలుగు గేర్ ఆప్షన్లు కూడా జత కలిపారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇంతకుముందే దీన్ని మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉన్నా కరోనా మహమ్మారి ప్రభావం వల్ల వాయిదా వేశారు. మిగతా కంపెనీలతో పోలిస్తే సెడాన్ మోడల్ కారు వెర్నాను డీజిల్ వర్షన్‌లో విడుదల చేయడం గమనార్హం.
హ్యుండాయ్ వెర్నా మోడల్ కారు మారుతి సుజుకి సియాజ్, స్కోడా రాపిడ్ టీఎస్ఐ మోడల్ కార్లతో పోటీ పడనున్నది. త్వరలో ఆవిష్కరించనున్న హోండా సిటీ 2020తోనూ తలపడనున్నది.
also read కరోనా ఎఫెక్ట్: రోల్స్ రాయిస్‌లో 9,000..ఓలాలో 1400 మంది ఉద్యోగులకు రాంరాం..
బ్లూ లింక్ కనెక్టివిటీ, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ కస్టర్ల విత్ 10.67 సీఎం కలర్ టీఎఫ్టీ ఎంఐడీ, వైర్ లెస్ ఫోన్ చార్జర్, స్మార్ట్ ట్రంక్, అర్కామైస్ సౌండ్ సిస్టం, డ్రైవర్ రేర్ వ్యూ మానిటర్ (డీఆర్వీఎం), ఎకో కోటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 8- అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
హ్యుండాయ్ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ మార్కెట్లో తమ వెర్నా ఫేవరెట్ గా నిలుస్తుందన్నారు. తమ సంస్థ గ్రోత్ స్టోరీలో వెర్నా మోడల్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు.
టెక్నాలజీ, స్టైలింగ్, ఫెర్ఫార్మెన్స్, సేఫ్టీ పరంగా ఈ మోడల్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. హ్యుండాయ్ వెర్నా కారు ఆరు రంగుల్లో.. ఫెర్రీ రెడ్, ఫాంటోమ్ బ్లాక్, పొలార్ వైట్, స్టార్రీ నైట్ (బ్లూ), టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్ రంగుల్లో వినియోగ దారులకు లభ్యం కానున్నది.
జాగ్వార్ లాండ్ రోవర్ పనుల పునరుద్ధరణ
టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) ప్రొడక్షన్ ప్లాంట్లలో కార్మికుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ మొట్టమొదటి రేంజ్ ఓవర్ కారును ఉత్పత్తి చేసింది. బుధవారం ఇంగ్లండ్ లోని జేఎల్ఆర్ ప్లాంట్‌లో దీన్ని తయారు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇటీవల కంపెనీ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఉద్యోగులు భౌతిక దూరం పాటిస్తూ పరిశుభ్రత పాటిస్తూ వారి ఆరోగ్యాన్ని పరిక్షించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు జేఎల్ఆర్ వెల్లడించింది. ఉత్పత్తి లైన్లు, ఇంజినీరింగ్ సదుపాయాలు, కార్యాలయాలు, మిగతా వాటిని సమీక్షించిన తర్వాతే ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. తాత్కాలిక షట్ డౌన్‌కు తెర దించుతూ అన్ని భద్రతా చర్యలతో మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించామని జాగ్వార్ లాండ్ రోవర్ ప్రొడక్షన్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెక్ పెర్‌సన్ చెప్పారు.