ఇండియన్ ఆర్మీ కోసం 718 జిప్సీ వాహనాలను డెలివరీ చేసిన మారుతి సుజుకి

By Sandra Ashok Kumar  |  First Published Jul 20, 2020, 2:43 PM IST

 జిప్సీ వాహనం భారత సైన్యంకి ఇష్టమైన వాహన ఎంపికగా కొనసాగుతోంది. కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మొట్టమొదట 1985 డిసెంబర్‌లో భారత మార్కెట్లో జిప్సీ వాహనాన్ని లాంచ్ చేసింది.


మారుతి సుజుకి జిప్సీ వాహనాన్నీ గత సంవత్సరంలో ఉత్పత్తిని నిలిపివేసింది, ఎందుకంటే తాజా భద్రత, ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్ గ్రేడ్ చేయకపోవడం, అయినప్పటికీ ఈ జిప్సీ వాహనం భారత సైన్యంకి ఇష్టమైన వాహన ఎంపికగా కొనసాగుతోంది.

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మొట్టమొదట 1985 డిసెంబర్‌లో భారత మార్కెట్లో జిప్సీ వాహనాన్ని లాంచ్ చేసింది. ఈ కారు దేశంలో లా ఎన్ఫోర్స్ మెంట్ కి బెస్ట్ ఛాయిస్ వాహనంగా మారింది. కారణం దీని పనితీరు, రిలయబిలిటీ, ఇంకా ఎక్కడికైనా వెళ్లగలిగే దీని సామర్ధ్యం.

Latest Videos

undefined

అయితే మారుతి సుజుకి గత సంవత్సరం ఇండియాలో జిప్సీ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది. అందుకు కారణం సేల్స్ ఆశించినంతగా లేకపోవడం, తాజా ఉద్గార,  భద్రతా నిబంధనలను పాటించకపోవడం మరొక కారణం కావొచ్చు. అయినప్పటికీ భారత సైన్యం జిప్సీ వాహనం పట్ల ప్రేమను విడిచిపెట్టినట్లు లేదు.

కారు నిలిపివేసిన తరువాత కూడా భారత సైన్యం అవసరమైనప్పుడు కొత్త  జిప్సీ వాహనాల కోసం ఆర్డర్లు ఇవ్వడం కొనసాగిస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖ మారుతి సుజుకి జిప్సీల కోసం భారత సైన్యం ఆర్డర్‌ను మినహాయింపు కల్పిస్తూ వారు ఆర్డరును నెరవేరుస్తుంది.

also read బీఎండబ్ల్యూ కొత్త బైక్‌.. 3 సెకన్లలో 100 స్పీడ్.. ...

దేశంలో జిప్సీ కార్ల ఉత్పత్తి  నిలిపివేసిన ఏడాది తరువాత కూడా మారుతి సుజుకి జూన్ 2020లో 718 యూనిట్ల జిప్సీ వాహనాలను భారత సైన్యానికి అందజేసింది. జిప్సీ వాహనాన్ని పవర్ చేస్తూ బిఎస్ 4-కంప్లైంట్ 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్, 80 హెచ్‌పి హై పవర్, 103 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది.

ఈ కారు ఫోర్-వీల్-డ్రైవ్ సెటప్‌తో స్టాండర్డ్ గా వస్తుంది. లో-రేంజ్  గేర్‌బాక్స్‌ను కూడా పొందుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రజలు కొనడానికి జిప్సీ వాహనాలు అందుబాటులో లేవని గమనించాలి. మారుతి సుజుకి ఆఫ్ రోడ్ వాహనాల కోసం చూస్తున్న వారి కోసం వేరే ఏదో ప్లాన్ చేస్తుండొచ్చు, అదే జిమ్మీ వాహనం .

భారతీయ మార్కెట్లో విక్రయించిన జిప్సీ వాస్తవానికి సుజుకి జిమ్నీ వాహనం రెండవ-జెన్ వెర్షన్ అని  తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది నాల్గవ-తరం అవతారంలోకి ప్రవేశించింది. ప్రజల స్పందనను అంచనా వేయడానికి 2020 ఆటో ఎక్స్‌పోలో చెప్పిన ఎస్‌యూవీని మారుతి వెల్లడించింది.

ఈ కారు ఈ ఏడాది చివరినాటికి లేదా 2021 ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుండొచ్చు, భారతీయుల కోసం 'జిప్సీ' గా రీబ్రాండ్ కూడా చేయవచ్చు.  మారుతి విటారా బ్రెజ్జా, సియాజ్ కోసం ఉపయోగించే అదే 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో ఈ ఎస్‌యూవీని అందించవచ్చు. ఈ ఇంజిన్ 105 పిఎస్ పవర్, 138 ఎన్ఎమ్ టార్క్ ని అందిస్తుంది. అదనంగా జిమ్మీ వాహనానికి  పార్ట్‌టైమ్ ఫోర్-వీల్ డ్రైవ్ సెటప్ కూడా లభిస్తుంది.

 

click me!