టక్సన్ ప్రైమ్ అనే విధి కుక్క హృదయపూర్వక కథ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టక్సన్ ప్రైమ్ ఒక వీధి కుక్క, బ్రెజిల్ దేశంలోని హ్యుందాయ్ కార్ షోరూమ్ దగ్గర తరచూ కనిపిస్తుంటుంది. ఈ కుక్క షోరూమ్ ఉద్యోగులు బయటకు వస్తేచాలు వారి వెంటే తిరిగేది.
కారు కొనడానికి షోరూమ్‌లోకి వెళ్తుంటాము, వెళ్ళగానే అందులో ఉండే సేల్స్ పర్సన్ పాలరిస్తాడు. ఒకవేళ సేల్స్ పర్సన్ బదులు ఒక కుక్క ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.
హ్యుందాయ్ షోరూమ్ ఒక వీధి కుక్కని దత్తత తీసుకుని టక్సన్ ప్రైమ్ అని నామకరణం చేసి దానికి సేల్స్‌పర్సన్‌గా నియమించుకున్నరూ. టక్సన్ పేరుతో హ్యుందాయ్ కారు కూడా ఉందన్న విషయం మీకు తెలిసిందే.
టక్సన్ ప్రైమ్ అనే విధి కుక్క హృదయపూర్వక కథ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టక్సన్ ప్రైమ్ ఒక వీధి కుక్క, బ్రెజిల్ దేశంలోని హ్యుందాయ్ కార్ షోరూమ్ దగ్గర తరచూ కనిపిస్తుంటుంది.
ఈ కుక్క షోరూమ్ ఉద్యోగులు బయటకు వస్తేచాలు వారి వెంటే తిరిగేది. దీన్ని గమనించిన షోరూం నిర్వాహకులు చేరదీసి తమ గౌరవ ఉద్యోగిగా ప్రకటించారు. అది కూడా ఒక ఐడి కార్డును దాని మెడకు తగిలించారు.
also read
వరల్డ్ ఆఫ్ బజ్ ప్రకారం, ఈ సంవత్సరం మే నెలలో హ్యుందాయ్ షో రూం ఈ కుక్కను దత్తత తీసుకున్న తరువాత కార్ సేల్స్ మాన్ గా పదోన్నతి పొందింది. మూడు రోజుల క్రితం హ్యుందాయ్ బ్రెజిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తర్వాత టక్సన్ ప్రైమ్ కథ వైరల్ అయ్యింది.
"హ్యుందాయ్ ప్రైమ్ డీలర్‌షిప్‌లోని సేల్స్ డాగ్ టక్సన్ ప్రైమ్‌ను కలవండి" అని ఆటోమోటివ్ తయారీదారు సరికొత్త ఉద్యోగి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేస్తూ పోస్ట్ చేశారు.
"కొత్త ఉద్యోగికి ఒక సంవత్సరం వయస్సు ఉంటుందని, హ్యుందాయ్ కుటుంబం దానిని స్వాగతించింది, అది ఇప్పటికే సహోద్యోగులు, కస్టమర్ల మనసును గెలిచింది" అని చెప్పారు.
టక్సన్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 30,000 'లైక్‌లను' సేకరిచింది. ఈ వీధి కుక్క సోషల్ మీడియాలో భలే పాపులర్ గా మారింది. దానికి సొంత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది, దీని ఖాతాలో 28,000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఈ కథనాన్ని షేర్ చేసిన వారిలో నటుడు స్వస్తిక ముఖర్జీ కూడా ఉన్నారు.