తాజాగా ఈ సంస్థ లాంచ్ చేసిన సరికొత్త వాహనం భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఫెర్రారీ ఎఫ్8 ట్రిబ్యూటో అనే పిలవబడే మోడల్ ఇప్పుడు కార్ల ప్రియులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ కార్ ఎక్స్ షోరూం ధర వచ్చేసి రూ.4.02 కోట్లుగా సంస్థ నిర్ణయించింది.
లగ్జరీ కార్లను ఉత్పత్తి చేసి విక్రయించడంలో గొప్ప పేరు పొందిన సంస్థ ఫెరారీ. ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ అయిన ఫెరారీ విలాసవంతమైన కార్లను ఉత్పత్తి చేయడమే కాకుండా అత్యుత్తమ సేల్స్ కూడా అందుకుంటోంది. తాజాగా ఈ సంస్థ లాంచ్ చేసిన సరికొత్త వాహనం భారత మార్కెట్లోకి వచ్చేసింది.
ఫెర్రారీ ఎఫ్8 ట్రిబ్యూటో అనే పిలవబడే మోడల్ ఇప్పుడు కార్ల ప్రియులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ కార్ ఎక్స్ షోరూం ధర వచ్చేసి రూ.4.02 కోట్లుగా సంస్థ నిర్ణయించింది. ఫెర్రారీలోని పాపులరైన 488 జీటీబీ మోడల్ తర్వాత అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సూపర్ కారులో మిడ్ ఇంజిన్ ను అమర్చారు.
ఫెర్రారీ ఎఫ్8 ట్రిబ్యూటో నాన్ హైబ్రిడ్ వీ8 పవర్డ్ ఆప్షన్ ఉన్న చివరి సూపర్ కారు ఇది. ఈ వాహనాన్ని 2019లో జెనీవా మోటార్ షోలో తొలిసారిగా ప్రదర్శించారు. అత్యాధునిక హంగులు, వేగం, ఇంజిన్, సాంకేతికతతో అందుబాటులోకి వచ్చిన ఫెర్రారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కారు కార్ల ప్రియులను యమ ఆకట్టుకుంటోంది.
ఈ సరికొత్త ఎఫ్8 ట్రిబ్యూటో మోడల్ 3.9-లీటర్ ట్విన్ టర్బో ఛార్జెడ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 720 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 770 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ స్టాండర్డ్ గేర్ బాక్స్ సిస్టంతో పనిచేస్తుంది.
also read మారుతి బ్రెజ్జాకి పోటీగా కియా మోటార్స్ సరికొత్త కారు.. ...
మిడ్ ఇంజిన్ రేంజ్ లో ఇప్పటివరకు వచ్చిన ఫెర్రారీ కార్లలో ఇదే అత్యంత వేగవంతమైన కారని ఫెర్రారీ సంస్థ తెలిపింది. దీని టాప్ స్పీడ్ గంటకు 340 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అంతేకాకుండా 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ కేవలం 2.9 సెకండ్లలోనే అందుకుంటుంది.
0 నుంచి 200 కిలోమీటర్ల స్పీడ్ కేవలం 7.8 సెకండ్లలోనే చేరుకుంటుంది. అంతేకాకుండా దీని ముందు మోడల్ తో పోలిస్తే 40 కేజీలు బరువు కూడా తక్కువ, 15 శాతం ఎక్కువ డౌన్ ఫోర్స్ తో అందుబాటులోకి వచ్చిందని ఫెర్రారీ స్పష్టం చేసింది.
ఫెర్రారీ ఎఫ్8 మోడల్ లోపల చూస్తే మొత్తం డిజిటల్ స్క్రీన్లతో అదరగొడుతోంది. 7.0-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, లార్డ్ ప్యాడిల్ షిఫ్టర్లు తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా దీని ముందు మోడల్ 488 జీటీబీతో పోలిస్తే పూర్తిగా ఈ కారు డిజైన్ ను పునరుద్ధరించారు.
డ్రైవర్ సెంట్రిక్ కాక్ పిట్ తో సహా డ్యాష్ బోర్డు, ప్రీమియం లెదర్ మెటిరీయల్స్, కార్బన్ ఫైబర్ ట్రిమ్స్ వాటిని పూర్తిగా మార్చారు. రీఫ్రెష్డ్ హెడ్ ల్యాంపులు, స్పాయిలర్ మార్పులతో డిజైన్ ను మార్చేశారు. అంతేకాకుడా ఈ సరికొత్త ఎఫ్8 ట్రిబ్యూటో మోడల్ స్టైలిష్, స్పోర్టీ అగ్రెసివ్ లుక్ తో ముందు మోడల్ తో పోలిస్తే మరింత ఆకర్షిస్తుంది.