టోల్ చార్జీల కోసం డిజిటల్, ఐటి ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 1 డిసెంబర్ 2017 లోపు విక్రయించిన పాత వాహనాలతో సహా అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్స్ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు.
వచ్చే ఏడాది 1 జనవరి 2021 నుండి నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్‌లు తప్పనిసరి అంటూ పేర్కొంటూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (మోఆర్‌టిహెచ్) శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
టోల్ చార్జీల కోసం డిజిటల్, ఐటి ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 1 డిసెంబర్ 2017 లోపు విక్రయించిన పాత వాహనాలతో సహా అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్స్ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు.
సెంట్రల్ మోటారు వాహన నిబంధనల ప్రకారం, 1 డిసెంబర్ 2017 నుండి కొత్త నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫాస్ట్ ట్యాగ్ అవసరం. వీటిని వాహన తయారీదారులు లేదా డీలర్లు సప్లయ్ చేస్తారు.
also read చలికాలంలో కారును బయట పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రతలు వహించండి.. ...
ఫాస్ట్ ట్యాగ్ అనేది ప్రీపెయిడ్ ట్యాగ్, దీనిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్వహిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్ ఉండటం వల్ల టోల్ ఛార్జీలను ఆటోమాటిక్ గా చార్జ్ చేస్తుంది.
వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికించిన, రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడి) ఆధారిత ట్యాగ్ ప్రీపెయిడ్ లేదా దానితో అనుసంధానించిన సేవింగ్స్ ఖాతా నుండి టోల్ ఫీజును నేరుగా చెల్లించడానికి అనుమతిస్తుంది. నగదు లావాదేవీల లేకుండా టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని ఆపకుండా అనుమతిస్తుంది.
ఫార్మ్ 51 (ఇన్సూరెన్స్ సర్టిఫికేట్) లో కొత్త థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పొందేటప్పుడు చెల్లుబాటు అయ్యే ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అని మోఆర్‌టిహెచ్ పేర్కొంది, ఇందులో ఫాస్ట్ ట్యాగ్ ఐడి వివరాలు పొందుపరుతారు. ఇది 1 ఏప్రిల్ 2021 నుండి వర్తిస్తుంది.
ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఫాస్ట్‌టాగ్ అమర్చిన తర్వాతే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రినివల్ జరుగుతుందని, అంతేకాకుండా నేషనల్ పర్మిట్ వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్ 2019 అక్టోబర్ 1 నుండి తప్పనిసరి చేసింది. టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్స్ ద్వారా మాత్రమే టోల్ ఛార్జీ ఉంటుందని, ఇది టోల్ ప్లాజాల ద్వారా అంతరాయం లేని పప్రయాణాన్ని చేస్తుంది.