చలికాలంలో కారును బయట పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రతలు వహించండి..

By Sandra Ashok Kumar  |  First Published Nov 7, 2020, 4:57 PM IST

ఈ చల్లని సీజన్ లో కార్ మైలేజ్ కోసం కొన్ని చిట్కాలు  పాటిస్తే మీరు కారు మైలేజీ పై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోవచ్చు. చాలా మంది శీతాకాలం ఇష్టపడతారు కాని చల్లని వాతావరణం కారు మైలేజీని ప్రభావితం చేసే అవకాశం ఉంది.


శీతాకాలం వచ్చింది, చల్లని వాతావరణం కారు మైలేజ్ పై ప్రభావం చూపిస్తుంది అనే విషయం తెలుసా మీకు... అవును ఇది నిజమే ఈ చల్లని సీజన్ లో కార్ మైలేజ్ కోసం కొన్ని చిట్కాలు  పాటిస్తే మీరు కారు మైలేజీ పై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోవచ్చు.

చాలా మంది శీతాకాలం ఇష్టపడతారు కాని చల్లని వాతావరణం కారు మైలేజీని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కొన్ని కార్ కేర్ చిట్కాల సహాయంతో మీరు మీ కారును మైలేజ్ తగ్గకుండా కాపాడుకోవచ్చు.

Latest Videos

చలిలో పార్కింగ్‌:  చల్లని బహిరంగ వాతావరణంలో కారును పార్కింగ్ చేయడానికి బదులు, కార్ షెడ్ ఉన్న ప్రదేశంలో కారును పార్క్ చేయాలి లేదా చుట్టూ గోడ ఉంటే అలాంటి ప్రదేశంలో పార్కింగ్ చేయటం మంచిది.

also read 

కారును చల్లని బహిరంగ ప్రదేశంలో పార్కింగ్ చేయడం వల్ల ఇంజన్ ఓవర్ కూల్ అవుతుంది, దీనివల్ల ఇంజన్ ఆయిల్ ను స్తంభింపజేస్తుంది, దీంతో కారు స్టార్ట్  చేసే  సమయంలో సమస్యలు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితిలో ఇంజన్ ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది.

బ్యాటరీపై చెక్ చేయడం: కారు నడుపుతున్నప్పుడు బ్యాటరీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయితే, కారు కారు స్టార్ట్ చేసేటప్పుడు సమస్య రవొచ్చు, అలాంటి పరిస్థితిలో కారు ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది. కారు బ్యాటరీ డిశ్చార్జ్ అవకుండా మంచి స్థాయిలో ఉంచండి, అలాగే బ్యాటరీని క్రమం తప్పకుండా చెక్ చేయండి.

ఇంజన్ ఆయిల్: కారు ఇంజన్ ఆయిల్ చాలా నల్లగా, పాతగా మారితే వెంటనే మార్చాలి కాబట్టి ఇంజన్ ఆయిల్‌పై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించండి. ఇంజన్ ఆయిల్ చాలా నల్లగా, పాతగా అయితే అది ఇంజన్‌కు మంచిది కాదు, దీని కారణంగా కూడా కారు మైలేజీపై ప్రభావం చేస్తుంది.

click me!